రెడ్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ నభా
'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్.
By: Tupaki Desk | 6 Dec 2024 9:30 AM GMT'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్. ఈ అమ్మడు తెలుగులో ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతో నటిగా మంచి పేరు సొంతం చేసుకున్న నభా ఆ తర్వాత సినిమాల్లో అందాల ఆరబోత చేయడం ద్వారా గ్లామర్‌తో మెప్పించింది. మొత్తానికి ఈ అమ్మడు టాలీవుడ్‌లో మంచి కమర్షియల్ హీరోయిన్‌గా నిలిచింది. ఈ అమ్మడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ కరోనా వల్ల ఆ సినిమా హిట్‌ను నభా క్యాష్ చేసుకుని మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని నభా నటేష్ మళ్లీ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది డార్లింగ్ అనే వెబ్ కంటెంట్‌తో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నభా నటేష్ వచ్చే ఏడాదిలో రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ అమ్మడు సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రెగ్యులర్‌గా ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
మరోసారి తన అందమైన ఫోటోలను నభా షేర్ చేయడంతో వార్తల్లో నిలిచింది. అందాల నభా నటేష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్‌లో నభా థైస్ అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో తో మతి పోగొడుతోంది. కవ్వించే ఆ చూపులకు ఎంతటి వారు అయినా మతి పోయి కింద పడిపోవాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మరోసారి ముద్దుగుమ్మ నభా నటేష్ అందాల ఆరబోత ఫోటోలు వైరల్ కావడం జరిగింది. ఇంతటి అందగత్తెకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రాకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు లో ఇప్పటి వరకు నభా నటేష్ నన్ను దోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాలు చేసింది. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలోనూ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఈమెకు నటిగా, అందాల ఆరబోత విషయంలో పాజిటివ్ మార్కులు దక్కాయి. కానీ లక్ కలిసి రాపోవడంతో ఆఫర్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ముందు ముందు అయినా ఈ అమ్మడికి మంచి ఆఫర్లు దక్కుతాయా అనేది చూడాలి.