నభా నటేష్: ట్రెడిషనల్ టచ్‌తో గ్లామర్ ఎలివేషన్
ఈ ఫోటోల్లో ఆమె మోడ్రన్ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతోంది.
By: Tupaki Desk | 21 Nov 2024 4:30 PM GMTటాలీవుడ్లో గ్లామర్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన నభా నటేష్, తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. లైమ్ గ్రీన్ కలర్ లెహంగాలో తన అందాన్ని మిళితం చేస్తూ, నభా పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె మోడ్రన్ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లౌజ్ డీటైల్స్, నభా యొక్క నడుము అందాలను హైలైట్ చేస్తూ, ఆమె స్టైలిష్ పోజులు అభిమానులను మంత్రముగ్ధులను చేశాయి.
ఇక నభా నటేష్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, కన్నడ చిత్రపరిశ్రమలో ‘వజ్రకయ’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తెలుగులో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమాతో నభాకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అనంతరం ‘డిస్కో రాజా’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల్లో కనిపించినా, ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు.
గత కొంత కాలంగా గాయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న నభా, ఇప్పుడు తన గ్లామర్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. ప్రస్తుతం నభా పీరియాడిక్ చిత్రమైన ‘స్వయంభూ’లో నిఖిల్ సరసన ప్రిన్సెస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నభాకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నభా, తన ఫ్యాషన్ స్టేట్మెంట్తో తరచుగా అభిమానులను అలరిస్తుంటారు. తాజా ఫోటోషూట్‌లో ఆమె వైవిధ్యమైన స్టైల్‌తో పాటుగా తన చార్మ్‌ని ప్రదర్శించారు. నభా నటేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. "నభా అందం వర్ణనాతీతం.. లెహంగా లుక్‌లో మరింత ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తోంది" అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద నభా నటేష్ తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, ఆమెకు వచ్చిన అవకాశాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.