Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : కవ్విస్తున్న నభా నటేష్‌

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 11:50 AM GMT
పిక్‌టాక్ : కవ్విస్తున్న నభా నటేష్‌
X

పదేళ్ల క్రితం కన్నడ సినిమా వజ్రకాయతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ నభా నటేష్‌. కన్నడంలో మూడు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో సుధీర్‌ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమాలో అందంతో కాకుండా అభినయంతో నభా మెప్పించింది. చాలా యాక్టివ్‌గా ఉన్న నభా నటేష్ ఆ సమయంలో తెలుగులో హాట్‌ టాపిక్‌ గా మారింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

సూపర్‌ హిట్‌ పడ్డ వెంటనే కరోనా కారణంగా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాపై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలు సైతం అంతంత మాత్రమే అన్నట్లుగా ఆడాయి. గత ఏడాది డార్లింగ్ అనే వెబ్‌ మూవీతో వచ్చిన ఈ అమ్మడు మరోసారి నటనతో మెప్పించింది. ప్రస్తుతం స్వయంభూ అనే సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాదిలో ఆ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నడుము నాభి అందాలు చూపిస్తూ ఆకట్టుకున్న ఈ అమ్మడు కవ్విస్తుంది. ఈ రేంజ్‌ అందంతో కవ్విస్తున్నా ముద్దుగుమ్మ నభా నటేష్‌కి లక్‌ కలిసి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ఈ అమ్మడికి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవాకాశాలు వస్తాయా అనేది చూడాలి.

ఈమధ్య కాలంలో వెబ్ సిరీస్‌ ఆఫర్లు సైతం ఈ అమ్మడి తలుపు తట్టినట్లు సమాచారం అందుతోంది. కానీ ఈమె సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో వాటిని నో చెప్పిందని తెలుస్తోంది. పలు అవార్డులు దక్కించుకున్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి అప్పుడే పదేళ్లు అవుతున్నా ఇంకా కొత్త లుక్‌తో ఆకట్టుకునే విధంగా ఉంది. కనుక మరో పదేళ్ల పాటు ఈ అమ్మడు ఇదే జోష్‌ను కొనసాగించే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.