ఊపేయడానికి సిద్దమైన హాట్ బ్యూటీ!
అమ్మడు తొలుత ఓ లవ్ స్టోరీతో వచ్చిన సమయంలో పూరి కళ్లలో పడటంతో 'ఇస్మార్ట్ శంకర్' లో చాన్స్ అందుకుంది.
By: Tupaki Desk | 27 March 2025 11:30 AM'ఇస్మార్ట్ శంకర్' తో హాట్ బ్యూటీ గా వెలుగులోకి వచ్చిన నభా నటేష్ గురించి పరిచయం అవసరం లేదు. అమ్మడు తొలుత ఓ లవ్ స్టోరీతో వచ్చిన సమయంలో పూరి కళ్లలో పడటంతో 'ఇస్మార్ట్ శంకర్' లో చాన్స్ అందుకుంది.
దీంతో నభా అవకాశాలకు దూరమైంది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అటెన్షన్ డ్రా చేస్తుంది. ఇన్ స్టాలో వెడెక్కించే ఫోటోలతో..భంగిమలతో అలరిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా బ్యూటీ ఐటం భామగా కొత్త టర్నింగ్ తీసుకుంది. అదీ బాలీవుడ్ లో ఆ ఛాన్స్ రావడం వివేషం. సన్ని డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని `జాట్` అనే యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్- పీపూల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు హిందీలోనే నిర్మిస్తున్నాయి. ఇందులో ఐటం పాటకు పలువురు భామల్ని పరిశీలించి చివరిగా నభా నటేష్ ని ఎంపిక చేసారు. ఈ పాట కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఓ భారీ సెట్ ని సిద్దం చేసారు. నేటి నుంచే ఆ పాట చిత్రీ కరణ కూడా మొదలవుతుందని సమాచారం. ఇప్పటి వరకూ నభా నటేష్ ఐటం పాటల్లో నటించలేదు.
తొలిసారి ఆ రకంగానూ అమ్మడు అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. హీరోయిన్ అవకాశాలు లేని నేపథ్యం లో? మొదలైన ఈ కొత్త జర్నీతోనైనా బిజీ అవుతుందేమో చూడాలి. తెలుగులో చివరిగా `డార్లింగ్` చిత్రంలో నటింది. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్లీ కొత్త ప్రాజెక్ట్ దేనికి సైన్ చేయలేదు.