Begin typing your search above and press return to search.

నడుము వయ్యారంతో నభా.. వ్వాటే స్టన్నింగ్ లుక్

తాజాగా నభా నటేష్ కబినీ ఫారెస్ట్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 1:59 PM GMT
నడుము వయ్యారంతో నభా.. వ్వాటే స్టన్నింగ్ లుక్
X

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నభా నటేష్.. తన గ్లామర్, స్టైలిష్ లుక్స్ తో నిత్యం అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో నభా తరచూ తన లేటెస్ట్ ఫొటోషూట్లు, ట్రిప్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. తాజాగా నభా నటేష్ కబినీ ఫారెస్ట్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


నభా ఈ ట్రిప్ గురించి ఇన్‌స్టా పోస్ట్‌లో ఆసక్తికరంగా వివరించారు. "బెంగళూరు → మైసూరు → కబినీ. మైసూరు రోడ్‌లో తట్టి ఇడ్లీ తినడానికే వెళ్లాను. చివరకు కబినీ చేరిపోయాను." అంటూ సరదాగా కామెంట్ చేశారు. ఈ ఫొటోలో నభా సింపుల్ లుక్‌లో, ప్యాంట్, టాప్ ధరించి స్వేచ్ఛగా, ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో క్యూట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము నాభి అందం హైలెట్ గా నిలిచింది.


నభా నటేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోకి నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. నభా కూల్ లుక్స్, సింప్లిసిటీని ప్రశంసిస్తూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. నీ గ్లామర్ తో ఎవరికైనా పోటీ ఇవ్వగలవు అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. నభా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్ల ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు.


నభా గత కొంతకాలం గాయాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ తన కెరీర్‌ని పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల అయిన డ్యాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అంతేకాకుండా ప్రస్తుతం 'స్వయంభూ' అనే పీరియాడిక్ సినిమా చేస్తున్న నభా, ఈ సినిమాలో నిఖిల్ సరసన ప్రిన్సెస్ పాత్రలో కనిపించబోతున్నారు.


నభా ఈ ట్రిప్ ఫోటోలతోనే కాకుండా అప్పుడప్పుడు జీవితానికి సంబంధించిన కొటేషన్స్ తో కూడా ఆలోచింపజేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నభా ట్రిప్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు ఇలా ఏది పోస్ట్ చేసినా వెంటనే ట్రెండ్ అవుతాయి. ఇక ఆమె కెరీర్ కూడా మళ్ళీ జోరు మీద ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అమ్మడు తన గ్లామర్ తో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.