Begin typing your search above and press return to search.

నభా నటేష్.. హీటేక్కిస్తున్న గ్లామర్ ట్రీట్

తాజాగా ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. ఇందులో నభా తన బోల్డ్ లుక్స్‌తో అందర్నీ ఫిదా చేసేసింది.

By:  Tupaki Desk   |   5 March 2025 8:44 AM IST
నభా నటేష్.. హీటేక్కిస్తున్న గ్లామర్ ట్రీట్
X

టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ తన స్టైల్ స్టేట్మెంట్‌తో మరోసారి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో, అదే స్థాయిలో తన స్టన్నింగ్ ఫోటోషూట్‌లను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. ఇందులో నభా తన బోల్డ్ లుక్స్‌తో అందర్నీ ఫిదా చేసేసింది.


స్టన్నింగ్ లుక్స్‌తో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటోషూట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ కెల్విన్ క్లీన్ బ్రా, లూజ్ బేజీ షర్ట్, మ్యాచింగ్ ట్రౌజర్స్‌లో నభా తన గ్లామర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఒంటి మీద కవర్ చేసుకునేలా ఒక క్యాజువల్ లుక్ ఇచ్చినప్పటికీ, తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ లుక్స్‌లో నభా మోడ్రన్ యాంగిల్‌లో కొత్తగా కనిపించడం అభిమానులకు మజానే అందిస్తోంది.


ఈ ఫోటోలను షేర్ చేస్తూ, నభా "మార్చి అంటే ఫిబ్రవరి మాత్రమే, మంచి లైటింగ్ ఉంటే!" అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ క్యాప్షన్ ఆమె ఫోటోషూట్‌కు ఎంత కష్టపడ్డారో చెప్పకనే చెబుతోంది. నెటిజన్లు ఆమె లుక్స్‌పై ఫిదా అవుతూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్‌లో నభా గ్లామర్‌కు ఓ రేంజ్ ఉంది, బోల్డ్‌నెస్‌కీ, క్లాస్‌కీ మిక్స్ నువ్వే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


సినిమాల విషయానికి వస్తే, నభా ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమాలో నిఖిల్‌కు జోడిగా నటిస్తోంది. అలాగే అనే మరో రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది. గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ అందుకున్న నభా, మళ్లీ అదే స్థాయి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవలి కాలంలో నటన పరంగా మంచి ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటూ, కెరీర్‌ను కొత్త దిశగా మలచుకుంటోంది.