తీవ్ర గాయాల నుంచి కోలుకుని మళ్లీ నభా గేమ్ మొదలు
ఇంతలోనే నభా నటేష్ కి జరిగిన ప్రమాదం గురించి ముచ్చట సాగింది. ప్రమాదం తర్వాత శరీరంలో పలు చోట్ల దెబ్బలు పగుళ్ల కారణంగా నేను లాక్‌డౌన్‌ను పొడిగించాను!
By: Tupaki Desk | 29 Aug 2023 4:23 PM GMT2021లో మాస్ట్రో చిత్రంలో చివరిసారిగా కనిపించిన నభా నటేష్ మళ్లీ పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. మహమ్మారి సమయంలో నభా చాలా గ్యాప్ తీసుకుంది. అయితే మహమ్మారీ కనుమరుగై షూటింగులు తిరిగి ప్రారంభమైనా కానీ.. ఇతర నటీనటులు షూటింగులకు వెళుతున్నా కానీ నభా నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో అసలు నభా నటేష్ కి ఏమైంది? అంటూ ఆరాలు కొనసాగాయి.
ఇంతలోనే నభా నటేష్ కి జరిగిన ప్రమాదం గురించి ముచ్చట సాగింది. ప్రమాదం తర్వాత శరీరంలో పలు చోట్ల దెబ్బలు పగుళ్ల కారణంగా నేను లాక్‌డౌన్‌ను పొడిగించాను! అని నభా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది.. నేను సజీవంగా ఉన్నాను..! అని నభా తెలిపింది. ఇప్పుడు తిరిగి నటించేందుకు సిద్ధంగా ఉన్నాను... శక్తి వచ్చింది! అని కూడా నభా వెల్లడించింది.
ప్రస్తుతం తెలుగు - తమిళంలో పలు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పింది. అయితే వాటిని ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంపై నభా కూడా స్పష్ఠతనిచ్చింది. "నేను చాలా విషయాలు వెల్లడించలేను.. కానీ నేను ఇంతకు ముందు చేయని పాత్రలను ఎంపిక చేసుకున్నాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలని చూస్తున్నాను.. కమర్షియల్ స్పేస్‌లో కూడా ఆకట్టుకుంటాను. నేటితరం నటీమణులు స్వర్ణయుగంలో ఉన్నామని నేను భావిస్తున్నాను. దర్శకుల క్రియేటివిటీ మాకు ఇచ్చే పాత్రలకు ధన్యవాదాలు"అని నభా ఆనందం వ్యక్తం చేసింది.