Begin typing your search above and press return to search.

అందాల నభా దేవి సోగసు చూడ తరమా!

ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 7:50 AM GMT
అందాల నభా దేవి సోగసు చూడ తరమా!
X

సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో 2018లో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ నభా నటేష్. మొదటి సినిమాతోనే అందంతో పాటు నటిగా మంచి మార్కులు సొంతం చేసుకుంది. చలాకీ అమ్మాయి, క్యూట్‌ పక్కిటి అమ్మాయి అనే ట్యాగ్‌ ను సొంతం చేసుకున్న నభా నటేష్ వరుసగా పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో ఈమె పోషించిన పాత్ర చాందిని పాత్రను ప్రేక్షకులు ఓన్‌ చేసుకుని భలే ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కరోన మొత్తం మార్చేసింది.


కరోనా కారణంగా ఒకటి రెండు ఆఫర్లు చేతి వరకు వచ్చి క్యాన్సల్‌ అయ్యాయి. అయినా పట్టు వదలకుండా వరుసగా సినిమాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా డార్లింగ్‌ అనే వెబ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నభా నటేష్ మరోసారి తన నటనతో మెప్పించింది. అందులో విభిన్నమైన పాత్రను పోషించి నటనకు ఆస్కారం ఉండటంతో దుమ్ము రేపింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈమె రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి అందమైన ఫోటోలు షేర్ చేసింది.


ఈసారి నభా నటేష్ షేర్ చేసిన ఫోటోలు ప్రత్యేకంగా నిలిచాయి. ఒక దేవ కన్య, దేవి రూపంలో అలంకరించుకుని, విభిన్నమైన చీర కట్టులో కనిపించడం ద్వారా నభా నటేష్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉన్న నభా నటేష్ కి టాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లోనూ ఆఫర్లు తగినంతగా రావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా నభా అందాల ఆరబోత ఫోటోలు కాకుండా సినిమాల్లో ఆమె అందం, నటన చూసే అవకాశం దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తాజా ఫోటో షూట్‌ లో నభా నటేష్‌ నడుము అందం చూపిస్తూ, కేరళ సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించడంతో పాటు, ముక్కుకు అందమైన ముక్కెర, లూజ్‌ హెయిర్ తో పూలు ధరించి నభా షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉన్న నభా నటేష్ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ముందు ముందు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు మరిన్ని రానున్నాయి. అయినా ఈ ఫోటోలు మాత్రం చాలా స్పెషల్‌ అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తూ లైక్ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. నభా ప్రస్తుతం స్వయంభూ అనే సినిమాలో నటిస్తూ ఉంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.