సొగసులు నభ.. వ్వాటే గ్లామర్
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఇండోర్ లో వేసిన ఓ సెటప్ లో ఆ బ్లాక్ కలర్ డ్రెస్ లో హొయలు పోయింది.
By: Tupaki Desk | 15 Sep 2023 12:33 PM GMTతెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే మనసు దోచేసింది కన్నడ అందం నభా నటేష్. ఈ ఇస్మార్ట్ బ్యూటీ మొదట మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. కన్నడలో మంచి హీరోయిన్ గా ఉన్న స్థానంలో ఉన్నప్పుడు, ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి.
తెలుగులో మొదటి సినిమా, సుధీర్ బాము హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయమైంది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరి మనసు దోచేసింది. ఆ తర్వాత వరసగా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇస్మార్ట్ శంకర్ లో అయితే అదరగొట్టేసింది. అందం, నటన విషయంలో తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ఆ మూవీలో తన లోని గ్లామర్ డోస్ ని పరిచయం చేసింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బ్యూటీ ఆఫర్లు క్యూ కట్టినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అవకాశాలు తగ్గిపోయాయి. రావడానికి కొన్ని ఛాన్సులు వచ్చాయి కానీ, పెద్దగా క్లిక్ అవ్వలేదు.
తన ఆరోగ్యం కారణంగా చాలా కాలం తానే స్వయంగా మూవీలకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ, తిరిగి ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా అదిరిపోయే ఫోటోషూట్స్ తో మతిపోగొడుతోంది. మామూలుగానే నభా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లు రావాల్సిన అవసరం కావడంతో, మరింత ఎక్కువగా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది.
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఇండోర్ లో వేసిన ఓ సెటప్ లో ఆ బ్లాక్ కలర్ డ్రెస్ లో హొయలు పోయింది. ఆ ఫోటోలు చూస్తుంటే, వర్షాకాలంలో,చల్లని వాతావరణంలో కూడా చెమటలు పట్టేలా ఉన్నాయి. తన నడుము, థైస్ అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. ఎలాంటి జ్యూవెలరీ ధరించకపోయినా, ఆమె మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం నభా నటేష్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. దాదాపు రేండెళ్లుగా ఈ బ్యూటీకి ఏ ప్రాజెక్ట్ కూ సైన్ చేయలేదు. దీంతో మళ్లీ కెరీర్ ను మళ్లీ గాడీలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చివరగా నితిన్ మాస్ట్రో మూవీలో నటించింది. మరి మళ్లీ ఈ అందాన్ని వెండితెరపై చూసేది ఎప్పుడో.