Begin typing your search above and press return to search.

తెలుగు ఆడియన్స్ కు డార్లింగ్ అవ్వాలని..!

అదేంటో కొంతమంది హీరోయిన్స్ కు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా ఇంకా కెరీర్ లో వెనకపడి ఉంటారు.

By:  Tupaki Desk   |   17 July 2024 7:52 AM GMT
తెలుగు ఆడియన్స్ కు డార్లింగ్ అవ్వాలని..!
X

అదేంటో కొంతమంది హీరోయిన్స్ కు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా ఇంకా కెరీర్ లో వెనకపడి ఉంటారు. అలాంటి వారిని ఒక లిస్ట్ ఔట్ చేస్తే ముద్దుగుమ్మ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ముందు ఉంటుంది. నన్ను దోచుకుందువటే సినిమాతోనే తెలుగు ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ అందులో తన నటనతో మెప్పించింది. యువ హీరోల సరసన నటిస్తూ సత్తా చాటుతున్న అమ్మడు ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో వరుస క్రేజీ ఆఫర్ కొట్టేస్తుందని అనుకున్నారు కానీ అది జరగలేదు.

మధ్యలో ఒక యాక్సిడెంట్ వల్ల నభా నటేష్ దాదాపు రెండేళ్ల వరకు బయటకు రాలేదు. చివరగా నితిన్ తో మ్యాస్ట్రో సినిమా చేసిన నభా నటేష్ ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. ఫైనల్ గా ప్రియదర్శి లీడ్ రోల్ లో తెరకెక్కిన డార్లింగ్ లో నటించింది నభా నటేష్. సినిమా చూస్తే ఇదేదో నభా ఫిమేల్ సెంట్రిక్ సినిమాలానే పూర్తి డామినేషన్ కనిపిస్తుంది.

ఓ పక్క కమెడియన్ గా చేస్తూ మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో సోలోగా ప్రయత్నిస్తున్న ప్రియదర్శి తన మార్క్ చాటాలని చూస్తున్నాడు. డార్లింగ్ సినిమాలో అతను హీరోగా చేస్తే నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె పాత్ర కూడా కొత్తగా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని అనిపిస్తుంది. ఐతే దాదాపు 3 ఏళ్ల తర్వాత అమ్మడు ఈ సినిమాతో వస్తుంది. డార్లింగ్ సినిమా మీద అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ సినిమాతో మరోసారి తన స్త్రెంగ్త్ చూపించేందుకు రెడీ అయ్యింది నభా నటేష్.

డార్లింగ్ హిట్ పడితే కచ్చితంగా నభా కు మళ్లీ వరుస ఛాన్సులు వచ్చేస్తాయని చెప్పొచ్చు. అందంతోనే కాదు అభినయంతో కూడా మెప్పించగలిగే నభా నటేష్ ఇక మీదట తన ఫోకస్ అంతా టాలీవుడ్ మీదే పెట్టేస్తుంది. డార్లింగ్ సినిమాతో ఆడియన్స్ కు ఆమె డార్లింగ్ అవ్వాలని చూస్తుంది. మరి సినిమా అమ్మడికి ఎలాంటి రిజల్ట్ అందిస్తుంది అన్నది చూడాలి. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ లో నభా చేస్తుందని ఆడియన్స్ అనుకున్నా ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. డార్లింగ్ లో తన ఎనర్జీ మొత్తం చూపించేస్తున్న నభాకు కచ్చితంగా ఫ్యూచర్ లో మంచి పాత్రలు వచ్చేస్తాయని చెప్పొచ్చు.