Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ నుంచి మ‌రో సూప‌ర్ హాట్ షో!

తాజాగా అమ్మ‌డి ప్ర‌యివేట్ ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ గా మారాయి. అందులో న‌భా న‌టేష్ మ‌రోసారి సూప‌ర్ హాట్ షోతో ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   7 July 2024 6:15 AM GMT
ఆ బ్యూటీ నుంచి  మ‌రో సూప‌ర్ హాట్ షో!
X

హాట్ బ్యూటీ న‌భా న‌టేష్ తెర‌పై క‌నిపించి మూడేళ్లు అవుతుంది. అమ్మ‌డు చివ‌రిగా `మ్యాస్ట్రో`లో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించింది లేదు. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి. అయితే బౌన్స్ బ్యాక్ మాత్రం భారీగానే ప్లాన్ చేసింది. మూడు నాలుగేళ్లు గ్యాప్ వ‌చ్చినా ఏకంగా పాన్ ఇండియా చిత్రం `స్వ‌యంభు`లో ఛాన్స్ అందుకోవ‌డంతో న‌భా పేరు మ‌ళ్లీ జోరుగా వినిపిస్తుంది.

ఈ గ్యాప్ లో ఇన్ స్టా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నా? సినిమాలు లేని న‌భాని లైట్ తీసుకున్న సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. స్వ‌యంభులో ఛాన్స్ త‌ర్వాత మ‌ళ్లీ యాక్టివిటీ స్పీడ‌ప్ చేసింది. ఫాలోయింగ్ పెంచుకునే కార్య‌క్ర‌మం జోరుగా చేస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో స్వ‌యంభు పై అంచ‌నాలు భారీగానే ఏర్ప‌డుతున్నాయి. సోషియా ఫాంట‌సీ సినిమా కావ‌డం తో నిఖిల్ ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తున్నారు.

అతడి లుక్..టీజ‌ర్ అన్ని ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌త్యేకంగా న‌భాని మ‌రింత అందంగా హైలైట్ చేస్తున్నారు. ఆమె గిరిజ‌న యువ‌తి లుక్ అంద‌రికీ బాగా క‌నెక్ట్ అయింది.

తాజాగా అమ్మ‌డి ప్ర‌యివేట్ ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ గా మారాయి. అందులో న‌భా న‌టేష్ మ‌రోసారి సూప‌ర్ హాట్ షోతో ఆక‌ట్టుకుంది. అమ్మ‌డు స్కిన్ షోని హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన ఔట్ ఫిట్ లో మురిపం ఆక‌ర్ష‌ణీయం.

షోల్డ‌ర్ లెస్ స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో న‌భాలో బ్యూటీని ఓ రేంజ్ లో ఆవిష్క‌రించింది. న‌భా హెయిర్ స్టైల్..మ్యాక‌ప్ ..హై హీల్స్ ప్ర‌తీది మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. న‌భా ఫాలోవ‌ర్ల‌ను జోరుగా ఆక‌ట్టుకుంటున్నాయి.