Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : కవ్వించే చూపులతో ఇస్మార్ట్‌ బ్యూటీ

క్లీ వేజ్‌ షో తో పాటు థైస్ అందాలను చూపిస్తూ విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో నభా నటేష్ కవ్వించే చూపులతో ఫోటోలకు ఇచ్చిన ఫోజ్‌ కిల్లింగ్‌ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 July 2024 8:26 AM GMT
పిక్ టాక్ : కవ్వించే చూపులతో ఇస్మార్ట్‌ బ్యూటీ
X

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. హీరోయిన్ గా ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి పేరు సొంతం చేసుకుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో ఈ అమ్మడు చక్కగా నటిస్తుందనే మంచి మార్కులను సొంతం చేసుకుంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో మాస్‌ లేడీ పాత్ర లో నటించడం ద్వారా మరింతగా ఈ అమ్మడికి గుర్తింపు లభించింది. అయితే కరోనా కారణంగా ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ సక్సెస్ ఈమె కెరీర్‌ కి తోడ్పాటును అందించలేదు. ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతుంది.

హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేక పోయినా కూడా సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్‌ గా ఫోటోలను షేర్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఈ అమ్మడు ప్రస్తుతం డార్లింగ్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

తాజాగా ఇన్‌ స్టాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్లీ వేజ్‌ షో తో పాటు థైస్ అందాలను చూపిస్తూ విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో నభా నటేష్ కవ్వించే చూపులతో ఫోటోలకు ఇచ్చిన ఫోజ్‌ కిల్లింగ్‌ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసినా కూడా పాపం నభా నటేష్ కి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్ అందాల విందు ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తూ లైక్‌ చేసి వైరల్‌ చేశారు.