Begin typing your search above and press return to search.

నిఖిల్ బిగ్ బడ్జెట్ మూవీ.. ఆమె ఓ లీక్ ఇచ్చేసింది

యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అతని సినిమాల బడ్జెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది

By:  Tupaki Desk   |   11 July 2024 4:48 AM GMT
నిఖిల్ బిగ్ బడ్జెట్ మూవీ.. ఆమె ఓ లీక్ ఇచ్చేసింది
X

యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అతని సినిమాల బడ్జెట్ రేంజ్ కూడా పెరిగిపోయింది. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి స్పై మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇంటరెస్టింగ్ కథలని నిఖిల్ ఒకే చేశాడు. రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రస్తుతం నిఖిల్ చేతిలో ఉన్నాయి. వాటిలో ది ఇండియన్ హౌస్ ఒకటి కాగా, స్వయంభు అనే పీరియాడికల్ హిస్టారికకల్ బ్యాక్ డ్రాప్ కథ మరొకటిగా ఉన్నాయి.

స్వయంభు సినిమా కోసం నిఖిల్ ఏకంగా ప్రాచీన యుద్ధవిద్యలు, గుర్రపుస్వారీ కూడా నేర్చుకున్నాడు. అలాగే ఫుల్ గా బాడీ పెంచి చాలా స్ట్రాంగ్ మెన్ గా మారిపోయాడు. ఇప్పటికే స్వయంభు మూవీ నుంచి స్టిల్స్ బయటకొచ్చాయి. అవి ప్రేక్షకులకి బాగా రీచ్ అయ్యాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నభా నటేష్ మూవీలో ఓ రాకుమారి పాత్రలో కనిపించబోతోంది. ఆమె కెరియర్ స్వయంభు అతి పెద్ద సినిమాగా రానుంది..

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ మూవీ రెడీ అవుతోంది ఫిక్సల్ స్టూడియో స్వయంభు సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ లక్ష్యంగా ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా డార్లింగ్ మూవీ ప్రమోషన్స్ లో నభా నటేష్ స్వయంభు మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాన్ని లీక్ చేసింది. స్వయంభు మూవీ ఫ్రాంచైజ్ గా తెరకెక్కనున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

స్వయంభు పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే నభా నటేష్ మాత్రం స్వయంభు మూవీ గురించి చెబుతూ ఈ సీక్రెట్స్ బయటపెట్టింది. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ ప్రతి సినిమాకి కామన్ గా ముందే కన్ఫర్మ్ చేస్తున్నారు. మూవీ హిట్ అయితే కొనసాగింపు ఉంటుంది. లేదంటే మొదటి పార్ట్ తోనే మంగళం పడేస్తున్నారు.

అలా సీక్వెల్స్ ఎనౌన్స్ అయ్యి కూడా స్కంద, పెదకాపు సినిమాల నెక్స్ట్ పార్ట్స్ పక్కకి వెళ్లిపోయాయి. నిఖిల్ కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ ఉంది కాబట్టి కథల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. భారీ బడ్జెట్, యూనివర్శల్ కథలకి పెద్ద పీట వేస్తున్నాడు.