Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : నామినేషన్స్ లొల్లి.. సోనియా వర్సెస్ నబీల్ ఎవరు కరెక్ట్..?

నబీల్ తో సోనియా డిస్కషన్ అయినా కేవలం నామినేషన్స్ వరకే జరగ్గా సోనియా, యష్మిల వాదనలు నామినేషన్స్ అయ్యాక కూడా కొనసాగాయి.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:49 AM GMT
బిగ్ బాస్ 8 : నామినేషన్స్ లొల్లి.. సోనియా వర్సెస్ నబీల్ ఎవరు కరెక్ట్..?
X

బిగ్ బాస్ 8 మండే వచ్చింది అంటే చాలు నామినేషన్స్ కోసం కంటెస్టెంట్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తారో తెలియదు కానీ ఆడియన్స్ మాత్రం వారు వేసే నామినేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ప్రతి వారం లానే ఈ వారం కూడా నామినేషన్స్ లో రచ్చ జరిగింది. ఈసారి నామినేషన్స్ లో నబీల్ వర్సెస్ సోనియా ఫైట్ ఆసక్తికరంగా మారింది. గుడ్ల టాస్క్ లో సంచాలక్ గా నబీల్ బయాస్ గా చేశాడని అతనొక ఫెయిల్ సంచాలక్ అని సోనియా ఆరోపించగా.. ఆమెకు ధీటుగానే సమాధానం ఇచ్చాడు నబీల్.

సోనియాతో ఆర్యుమెంట్ చేస్తుంటే నిఖిల్, పృధ్విలు టోన్ తగ్గించమని చెప్పడం.. ఇంకా టాస్క్ లో కంట్రోల్ చేయాల్సిన టైం లో సోనియా రెచ్చగొట్టడం వల్ల టాస్క్ అలా టఫ్ గా మారిందని నబీల్ చెప్పాడు. ఐతే దానికి సోనియా సమాధానం చెప్పే టైం లో కూడా నిఖిల్, పృధ్విలు మాట కలిపారు. అంతేకాదు నబీల్ పృధ్వికి నామినేట్ వేస్తున్న టైం లో కూడా మధ్యలో సోనియా కలుగచేసుకుంది.

నబీల్ వర్సెస్ సోనియా ఫైట్ లో సోనియా మాట వినకుండా ఉండేందుకు నబీల్ గట్టి గట్టిగా అరిచాడు. నబీల్ లానే సోనియాని టార్గెట్ చేస్తూ మరో కంటెస్టెంట్ యష్మి కూడా సోనియాని నామినేట్ చేసింది. నిఖిల్, పృధ్విలను మధ్య ఉంటూ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని.. వాళ్ల పక్కన కాదు నువ్వు ఒంటరిగా ఆట ఆడాలని చెప్పి నామినేట్ చేసింది. నబీల్ తర్వాత సోనియాకు యష్మి నుంచి కూడా మాటల ఎటాక్ జరిగింది.

నబీల్ తో సోనియా డిస్కషన్ అయినా కేవలం నామినేషన్స్ వరకే జరగ్గా సోనియా, యష్మిల వాదనలు నామినేషన్స్ అయ్యాక కూడా కొనసాగాయి. అంతకుమును సోనియా నబీల్, ఆదిత్య ఓం లను నామినేట్ చేసింది. ఆదిత్య ఓం ను ఈ హౌస్ కి ఫిట్ కాదని వెళ్లిపోవడమే మంచిదని సోనియా ఆరోపించింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో కూడా సోనియా, పృధ్వి, నైనిక, మణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణ, నబీల్ లు నామినేషన్స్ లో ఉన్నారు. చీఫ్ అయిన కారణంగా నిఖిల్ ఒకరిని సేఫ్ చేయమని అడగ్గా నైనికని సేఫ్ చేశాడు. సో నైనిక నామినేషన్స్ నుంచి తప్పుకోగా ఆదిత్య ఓం, ప్రేరణ, మణికంఠ, సోనియా, పృధ్వి ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.