ఆర్టిస్టులకు పర్సనల్ స్పేస్ కరువైంది: నదియా
గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ నటి నదియా ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను దగ్గర నుంచి చూశారు.
By: Tupaki Desk | 8 March 2025 7:09 AMగత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ నటి నదియా ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను దగ్గర నుంచి చూశారు. అత్తారింటికి దారేది, అఆ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో చాలా పవర్‌ఫుల్ పాత్రలను చేసిన ఆమె హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఉమెన్స్ డే సందర్భంగా ఆమె ప్రస్తుత హీరోయిన్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు.
ఇప్పుడు నటీమణులకు స్పెషల్ స్టైలిస్ట్‌లు, కారావాన్లతో పాటూ అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వారి ఇబ్బందులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని నదియా తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒకప్పటిలా లేరు. ఆర్టిస్టులు ఏం చేసినా ప్రతీ మూవ్‌ను అందరూ పసిగడుతున్నారు. ప్రతీ ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను ఆర్టిస్టులపై రుద్దుతారని, కొన్నిసార్లు ట్రోల్ కూడా చేస్తారని ఆమె తెలిపారు.
సెలబ్రిటీగా ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇబ్బందుల్ని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ డిజిటల్ యుగంలో ఆర్టిస్టులకు పర్సనల్ స్పేస్ అనేది లగ్జరీగా మారిందని ఆమె అన్నారు. ఈ జెనరేషన్ నటీమణులు ఆత్మవిశ్వాసం, నమ్మకంతో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని నదియా సూచించారు.
ప్రపంచం మారింది కాబట్టి మనం కూడా అడ్జస్ట్ అయిపోవాలని, భయం వల్ల మనం ఏం చేయలేమని, ప్రతి ఒక్క మహిళకు జీవితంలో స్వీయ అవగాహన ఉండాలని, తమకు నచ్చినట్టు తమ జీవితాన్ని కొనసాగించాలని, సోషల్ మీడియా రూల్స్ కు వ్యతిరేకంగా తమకంటూ పర్సనల్ స్పేస్ ను క్రియేట్ చేసుకోవాలని నదియా కోరారు. మనం మన గురించి ఏం అనుకుంటామో, ఎలా భావిస్తామో ప్రపంచం కూడా మనల్ని అదేలా చూస్తుందని ఆమె తెలిపారు.
ఇక నదియా విషయానికొస్తే, రెండేళ్ల కిందట ఆమె చివరిగా తమిళంలో లెటజ్ గెట్ మ్యారీడ్ సినిమా చేసింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఆమె నుంచి మరో సినిమా రాలేదు. రెండేళ్ల నుంచి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ నదియా అందరికీ ఇన్సిపిరేషన్ గా నిలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆమె కొత్త ప్రాజెక్టులేవీ సైన్ చేయలేదు.