Begin typing your search above and press return to search.

స‌త్యం థియేట‌ర్ మ‌ళ్లీ స‌త్యంగానే!

ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా నాగ్ అశ్వీన్ అమీర్ పేట‌లోని సత్యం థియేట‌ర్ తో ఉన్న అనుబంధాన్ని ఓ సంద‌ర్భంలో గుర్తు చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 8:36 AM GMT
స‌త్యం థియేట‌ర్ మ‌ళ్లీ స‌త్యంగానే!
X

'క‌ల్కి 2898' విజ‌యం త‌ర్వాత పాన్ ఇండియాలో యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ఎంత ఫేమ‌స్ అయ్యాడో చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌కు ముందు 'మ‌హాన‌టి'తో మ‌రో సంచ‌ల‌నం అత‌డి ఖాతాలో ఉంది. ఇలా వ‌రుస రెండు విజ‌యాలు నాగ్ అశ్విన్ డైరెక్ట‌ర్ గా ఎంతో గొప్ప స్థానాన్ని క‌ల్పించాయి. ఇటీవ‌లే ఓ ఈవెంట్ లో ఏకంగా క‌మ‌ల్ హాస‌న్, మ‌ణిరత్నం లాంటి లెజెండ్స్ తోనే ఇంట‌రాక్ట్ అయ్యారు. క‌ల్కి కోసం క‌మల్ తో క‌లిసి ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో వీరిద్ద‌రు మ‌రిన్ని అద్బుతాలు చేయ‌డానికి అవ‌కాశ ఉంది. క‌మ‌ల్ హాస‌న్ ఇన్నోవేటివ్ ఐడియాల్ని వెండి తెర‌కు ఎక్కించే బాధ్య‌త‌లు నాగీ తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా నాగ్ అశ్వీన్ అమీర్ పేట‌లోని సత్యం థియేట‌ర్ తో ఉన్న అనుబంధాన్ని ఓ సంద‌ర్భంలో గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో స‌త్యం థియేట‌ర్ ఓ భాగ‌మ‌న్నారు. ఈ థియేట‌ర్ లో గీతోప‌దేశంలోని కుండ్య‌చిత్రం అంత‌ర్బంగమ‌ని ఇన్ స్టాలో రాసుకొచ్చారు.

'అయితే స‌త్యం థియేట‌ర్ మ‌ల్టీప్లెక్స్ గా మార్చాక ఆ కుడ్య చిత్రాన్ని భ‌ద్ర ప‌ర‌చేల‌ద‌ని ఆవేద‌న చెందాను. కానీ మ‌ళ్లీ ఆఫోటోని చూడ‌టం అనందంగా ఉంది. ఆ చిత్రాల‌ను అలాగే భ‌ద్ర ప‌రిచిన నిర్మాత సునీల్ నారంగ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసారు. స‌త్యం థియేట‌ర్ మ‌ళ్లీ స‌త్యంగానే ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

నాగ్ అశ్విన్ సినిమాల సంగ‌తి చూస్తే? ప్ర‌స్తుతం 'క‌ల్కి 2' కోసం ప‌నిచేస్తున్నారు. ఓ రెండు సినిమాల క‌థ ఒకే క‌థ‌గా రెండ‌వ భాగంలో చూపిస్తున్నారు. ఓ రెండు సినిమాలు రిలీజ్ అయి స‌క్స‌స్ అయితే ఎలా ఉంటుందో? ఆ స‌క్సెస్ క‌ల్కి 2తోనే అభిమానుల‌కు అందిస్తాన‌ని ఎంతో న‌మ్మకాన్ని వ్య‌క్తం చేసారు. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా అంతా ఎదురు చూస్తుంది. కానీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్ అవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది.