కల్కి -2 షూట్ డేట్ ఫిక్స్!
`కల్కి -2`కి రంగం సిద్దమైందా? నాగ్ అశ్విన్ రెండవ పార్ట్ ని కూడా త్వరిత గతిన పూర్తి చేసే పనిలో పడ్డారా? అంటే అలాగే అనిపిస్తుంది.
By: Tupaki Desk | 17 March 2025 11:28 PM IST`కల్కి -2`కి రంగం సిద్దమైందా? నాగ్ అశ్విన్ రెండవ పార్ట్ ని కూడా త్వరిత గతిన పూర్తి చేసే పనిలో పడ్డారా? అంటే అలాగే అనిపిస్తుంది. తొలి భాగం షూటింగ్ చేస్తోన్న సమయంలో రెండవ భాగానికి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. అయితే తాజాగా మిగిలిన 70 శాతం షూటింగ్ కి సంబంధించి నాగీ ప్రణాళిక సిద్దం చేసారు. మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం.
తొలి షెడ్యూల్ అమితాబచ్చన్ పాల్గొంటారు. అటుపై జూన్ లో రెండవ షెడ్యూల్ మొదలవుతుందిట. ఇందులో చాలా మేజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారుట. ఇందులోనే ప్రభాస్-కమల్ హాసన్ పై కీలక పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారుట. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉంటుందని సమా చారం. తొలి భాగంలో ఎక్కువగా అమితాబచ్చన్ పాత్ర హైలైట్ అయిన సంగతి తెలిసిందే.
సినిమాలో ప్రభాస్ ఉన్నా? హీరో ఎవరు? అంటే అమితాబ్ గానే భావించారంతా. అంత బలమైన పాత్ర అమితాబ్ పోషించారు. ఈ నేపథ్యంలో రెండవ భాగంలోనూ అమితాబ్ పాత్ర ఎక్కడా తగ్గదని తెలుస్తోంది. సినిమాలో చాలా సన్నివేశాలు ఎంతో యూనిక్ గా ఉండబోతున్నాయట. ఇంత వరకూ ఇండియాన్ స్క్రీన్ పై చూడని ఎన్నో సన్నివేశాలుంటాయంటున్నారు. అలాగే కథ ఎమోషనల్ గానూ కనెక్ట్ అవుతుందిట.
ఈ సినిమా ఎలా ఉంటుందన్నది నాగీ ఇప్పటికే హింట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ ఆలస్యమైనా ఓ రెండు సినిమాల ప్రభావం ఈ ఒక్క సినిమా కథలోనే ఉంటుందన్నారు. ప్రభాస్ పాత్ర రెండవ భాగంలో అభి మానుల ఊహని మించి ఉంటుందని వెల్లడించారు.