Begin typing your search above and press return to search.

మిడిల్ క్లాస్ కారుతో 1000 కోట్ల డైరెక్టర్

ఆ తర్వాత కల్కి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేయడంతో నాగీని మెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 5:29 AM GMT
మిడిల్ క్లాస్ కారుతో 1000 కోట్ల డైరెక్టర్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఆయన గురించే డిస్కస్ చేసుకున్నారు. రూ.4వేల శాలరీతో కెరీర్ మొదలుపెట్టి.. రూ.600 కోట్లతో కల్కి మూవీని తెరకెక్కించిన స్థాయికి ఎదిగిన ఆయన తీరును అంతా ప్రశంసించారు. ఆ తర్వాత కల్కి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేయడంతో నాగీని మెచ్చుకున్నారు.

చిన్నప్పటి నుంచి మీడియా, కథనాలు, వ్యాసాలు రాయడంపై ఆసక్తి ఉన్న నాగ్ అశ్విన్.. మొదట్లో దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో దర్శకుడిగా డెబ్యూ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మహానటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. నేషనల్ లెవెల్ లో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ మూవీతో తన టాలెంట్ ఏంటో ఓ రేంజ్ లో ప్రూవ్ చేసుకున్నారు.

అయితే నాగ్ అశ్విన్ సింప్లిసిటీ గురించి అందరికీ తెలిసిందే. సింపుల్ షర్ట్ లేదా టీషర్ట్ లో ఎప్పుడూ కనిపిస్తుంటారు. ఈవెంట్స్ అయినా ఎక్కడైనా ఒకేలా ఉంటారు. లగ్జరీగా ఉన్నట్లు అస్సలు కనిపించరు. ఇక కల్కి మూవీ రిలీజ్ టైమ్ లో ఆయన వాడుతున్న మహీంద్రా e2o ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో ఆ కారు గురించి చర్చ జరగ్గా.. ఇప్పుడు మరోసారి మాట్లాడుకుంటున్నారు.

తాజాగా నాగ్ అశ్విన్ కారు.. టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందుకు ఆయన పెట్టిన పోస్టే కారణం. రీసెంట్ గా నాగీ ఇన్ స్టాలో తన బుజ్జి కారు పిక్ ను షేర్ చేశారు. "మహానటి, జాతిరత్నాలు, కల్కి 2898 ఏడీ సినిమాల కోసం నా వాహనం.. e2oplus.. మహీంద్రా ఎలక్ట్రిక్ కారును నా ఇంటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్‌ తో ఛార్జ్ చేస్తా" అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే ఆయన పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

దీంతో నాగ్ అశ్విన్ సింప్లిసిటీ కోసం ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రూ.1200 కోట్లు రాబట్టిన సినిమా తీసిన ఆయన.. మిడిల్ క్లాస్ జనాలు వాడే ఇంత చిన్న కారు వాడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఎంత సింపుల్ గా ఉన్నారోనని అంటున్నారు. నాగీ సింప్లిసిటీ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాలుగైదు కోట్లు పెట్టి కల్కిలోని బుజ్జి కారును డిజైన్ చేయించిన ఆయన.. అంత చిన్న కారును ఎన్నో ఏళ్లుగా వాడడం గ్రేట్ అని చెబుతున్నారు.