సాయిపల్లవికి బిగ్ ఫ్యాన్.. ముందే అలా ఫిక్సయ్యా: నాగ్ అశ్విన్
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన ఆ సినిమా అక్టోబర్ 31వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.
By: Tupaki Desk | 27 Oct 2024 7:22 AM GMTనేచురల్ బ్యూటీ సాయిపల్లవికి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ముద్దుగుమ్మకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆమె సినిమాల కోసం ఎంతో వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో తండేల్ సినిమా చేస్తున్న సాయి పల్లవి.. బాలీవుడ్ లో రామాయణ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. త్వరలో అమరన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన ఆ సినిమా అక్టోబర్ 31వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.
తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను చాలా మందిలాగే సాయి పల్లవి ఫ్యాన్ అని చెప్పారు నాగీ. రీసెంట్ గా ఆమె ఇంట్రడక్షన్ వీడియో చూసినట్లు తెలిపారు. గ్లింప్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని చెప్పారు. వీడియో తనకు చాలా నచ్చిందని, సినిమా చూడాలనే ఆసక్తి రేపిందని తెలిపారు.
అందుకే ట్రైలర్ చూడకముందే.. సినిమా ఎలా అయినా చూడాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు. సినిమాపై డైరెక్టర్ ఎంత క్లారిటీగా అర్థమైందని తెలిపారు. మహానటి మూవీ తీశాను కనుక.. బయోపిక్స్ విషయంలో ఎంత బాధ్యత ఉంటుందో తనకు తెలుసని అన్నారు. అలాంటి సినిమాలు చేయడం అవసరమని, అమర్ ను సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ నిర్మించడం విశేషమని పేర్కొన్నారు. శివకార్తికేయన్ సినిమాల సెలక్షన్ బాగుంటుందని కొనియాడారు. ఆయన నటించిన డాక్టర్ చిత్రానికి మంచి అభిమానినని తెలిపారు నాగ్ అశ్విన్.
అనంతరం సాయి పల్లవి మాట్లాడుతూ.. అమరన్ మంచి మూవీ అని తెలిపారు. తాను యాక్ట్ చేసినందుకు గర్వంగా ఉందని చెప్పారు. కొందరు ఆర్మీ అధికారులకు చిత్రాన్ని చూపించామని, వారు బాగా కనెక్ట్ అయ్యారని అన్నారు. హీరో సూర్యకు కాకా కాకా ఇచ్చిన గుర్తింపు ఇప్పుడు అమరన్.. శివ కార్తికేయన్ కు తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఎన్ని సినిమాలు చేసినా.. తనను అంతా భానుమతిగానే గుర్తుంచుకుంటున్నారని అన్నారు. తన సినిమాలు ఎక్కడైనా ఆడుతున్నాయని అన్నారు. అందుకు తెలుగు దర్శకులకు రుణపడి ఉంటానని తెలిపారు.
ఇక సినిమా విషయానికొస్తే.. 2014లో మిలటరీ ఆపరేషన్ సమయంలో ప్రాణ త్యాగం చేసిన సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా అమరన్ రూపొందుతోంది. ముకుంద్ గా శివ కార్తికేయన్, ఆయన సతీమణిగా ఇందూ రెబెకా పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. యాక్షన్‌తోపాటు మంచి ప్రేమ కథతో రాజకుమార్ పెరియాసామి తెరకెక్కించారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి అమరన్ మూవీతో సాయిపల్లవి, శివకార్తికేయన్ ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాలి.