దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్.. పవన్‌పై నాగబాబు ప్రకటన!
జనసేనాని పవన్ కల్యాణ్‌ని భారత రాజకీయాల గేమ్ చేంజర్ అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ప్రకటన చేశారు.
By: Tupaki Desk | 24 Nov 2024 11:38 AM GMTజనసేనాని పవన్ కల్యాణ్‌ని భారత రాజకీయాల గేమ్ చేంజర్ అంటూ మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ప్రకటన చేశారు. ``పొలిటికల్ గేమ్ ఛేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్`` అనేది నాగబాబు సోషల్ మీడియా సందేశం. ఇది జనసైనికుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది.
ఆయన ఇలా ప్రకటించడం వెనక ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? అంటే కచ్ఛితంగా ఉంది. ఇది జనసేనాని వీరత్వానికి సంబంధించిన ప్రకటన. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం ఎన్డీకే కూటమికి మహా ఎన్నికల్లో ఎలా కలిసొచ్చిందో వివరించే ప్రకటన ఇది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే మద్ధతుగా ఉన్న మహాయుతి కూటమికి అఖండ మెజారిటీ రావడం వెనక జనసైనికులు, పవన్ అభిమానుల అండదండలున్నాయి. ఒకే ఒక్క సీటు మినహా పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన అన్ని సీట్లను భాజపా గెలుచుకుంది. దీంతో నాగబాబు నుంచి ప్రశంసలు వచ్చాయి.
``గెలిచిన ప్రతి రాజకీయ నాయకుడు హీరో. అయితే ప్రతి హీరో ఎన్నికల్లో గెలవలేరు. కేవలం గెలవకుండా తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాడే నిజమైన నాయకుడు. అతడి విజయం ఇతరులకు విజయపథంలో స్ఫూర్తినిస్తుంది. అలాంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్`` అని నాగబాబు అన్నారు.
నాగబాబు పూర్తి ప్రకటన ఇలా ఉంది.
గెలిచే ప్రతి నాయకుడు హీరోనే,
కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు..
నాయకుడంటే గెలిచే వాడే కాదు
నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం
అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం
నీడై నిలబడేవాడు,
తోడై నడిపించేవాడు,
వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు,
వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు,
అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు `ది పొలిటికల్ గేమ్ ఛేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్` `పవన్ కళ్యాణ్`