Begin typing your search above and press return to search.

నేనూ విడిపోయిన కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాడినే: నాగ చైత‌న్య‌

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో చైత‌న్య త‌న విడాకుల గురించి స్పందించాడు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 7:23 AM GMT
నేనూ విడిపోయిన కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాడినే: నాగ చైత‌న్య‌
X

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య గ‌త కొన్ని సినిమాలుగా వ‌రుస ఫ్లాపులు అందుకుంటూ వ‌స్తున్నాడు. అందుకే త‌న ఆశ‌ల‌న్నింటినీ తండేల్ పైనే పెట్టుకుని కెరీర్ లో మునుపెన్న‌డూ చేయ‌ని విధంగా తండేల్ కోసం ప్ర‌మోష‌న్స్ చేసుకుంటూ వ‌చ్చాడు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్ ఇంట‌ర్వ్యూలో చైత‌న్య త‌న విడాకుల గురించి స్పందించాడు.

గ‌త మూడేళ్లుగా విడాకుల టాపిక్ వ‌చ్చిన ప్ర‌తీసారి ఆన్స‌ర్ ఇస్తూనే ఉన్న‌ప్ప‌టికీ ఈ వార్త‌ల‌కు ఎక్క‌డా ఫుల్ స్టాప్ ప‌డ‌టం లేద‌ని, ఎన్ని సార్లు మాట్లాడినా, ఎంత క్లారిటీ ఇచ్చినా నా గ‌తంలో ఏం జ‌రిగింద‌నేది రాసేవాళ్లు రాసుకుంటూనే ఉన్నార‌ని చైత‌న్య అన్నాడు. తానొక పెద్ద కుటుంబం నుంచి రావ‌డ‌మే కాదు, తాను కూడా ఒక విడిపోయిన కుటుంబం నుంచి వ‌చ్చిన వాడినేన‌ని, ఆ బాధ ఎలా ఉంటుందో త‌న‌కు తెలుస‌ని అన్నాడు.

ఆ బాధ తెలిసి కూడా విడాకులు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నానంటే ఎన్ని సార్లు ఆలోచించానో అంద‌రూ అర్థం చేసుకోవాల‌ని, రాత్రికి రాత్రి నిర్ణ‌యం తీసేసుకుని విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించలేద‌ని, ఈ విష‌యంలో తామిద్ద‌రం ఎన్నో సార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకుని దాన్నే అంద‌రికీ ప్ర‌క‌టించిన‌ట్టు చెప్పాడు చైత‌న్య‌.

త‌మ డెసిష‌న్ ను అనౌన్స్ చేసేట‌ప్పుడు ఎవ‌రి దారిలో వారు వెళ్లాల‌నుకుంటున్నాం. ద‌య‌చేసి మా ప్రైవ‌సీకి భంగం క‌లిగించొద్ద‌ని అంద‌రినీ కోరుకున్నాం. కానీ మేం అనౌన్స్ చేసిన మెసేజ్ అంద‌రికీ ఓ హెడ్ లైన్ అయింద‌ని, మా బాధ‌ను అర్థం చేసుకోకుండా దాన్ని ఎంట‌ర్టైన్మెంట్ గా మార్చి ఎవ‌రికి ఇష్ట‌మొచ్చిన‌ట్టు వాళ్లు వార్త‌లు రాసుకున్నార‌న్నాడు చైతూ.

తామిద్ద‌రూ ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోయామ‌ని, ఎవ‌రి దారి వారు చూసుకున్నామ‌ని, వాస్త‌వానికి పెళ్లయ్యాక ఇలాంటి నిర్ణ‌యం తీసుకునే సిట్యుయేష‌న్ రాకూడ‌ద‌ని, కానీ వ‌చ్చిందని, ఏం జ‌రిగినా దానికో కార‌ణ‌ముంటుంద‌ని పేర్కొన్న చైత‌న్య‌, త‌న ప‌ర్స‌నల్ లైఫ్ గురించి ట్రోల్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసే వాళ్లు, వాళ్ల‌ లైఫ్ మీద ఆ టైమ్ ను ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంద‌ని, ప్ర‌స్తుతం త‌న లైఫ్ చాలా బావుంద‌ని చైత‌న్య తెలిపాడు.