వాళ్లు నన్ను కొడుకులా చూసుకుంటారు : నాగ చైతన్య
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. గత వారం రోజులుగా జరుగుతున్న పెళ్లి తంతుకు రేపటితో ముగింపు పలక బోతున్నారు.
By: Tupaki Desk | 3 Dec 2024 7:10 AM GMTఅక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. గత వారం రోజులుగా జరుగుతున్న పెళ్లి తంతుకు రేపటితో ముగింపు పలక బోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వేసిన ప్రత్యేక పెళ్లి మండపం సెట్‌లో నాగ చైతన్య, శోభిత దూళిపాల ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీగా ఉన్న ఈ కొత్త జంటను ఆశీర్వదించేందుకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు రేపు పెళ్లికి హాజరు కాబోతున్నరు. ఈ పెళ్లి తేదీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడిన విషయం తెల్సిందే. శోభిత, ఆమె కుటుంబ సభ్యులపై చైతూ చాలా పాజిటివ్ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ... ప్రతి తెలుగు ఇంటిలాగే శోభిత ఫ్యామిలీ చాలా సాంప్రదాయబద్దమైన ఫ్యామిలీ. చాలా సంస్కారంతో ప్రవర్తించే ఫ్యామిలీ. వారి కుటుంబంలో తాను ఆప్యాయతను చూశాను. ఆ కుటుంబానికి చెందిన వారు తను ఒక కొడుకులా చూస్తారు. ఆ ఫ్యామిలీలోకి వెళ్లడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఫ్యామిలీ పరిది శోభిత ఫ్యామిలీతో కలిసి పెరగడం ఆనందాన్ని కలిగిస్తుందని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. పెళ్లి తర్వాత శోభిత నటిస్తుందా అనే ప్రశ్నకు నాగ చైతన్య సమాధానంగా కచ్చితంగా ఆమె సినిమాల్లో నటిస్తుందని చెప్పుకొచ్చారు. శోభిత బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ వరుసగా సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
నాగ చైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. సమంత చెన్నైకి చెందిన తమిళ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అనే విషయం తెల్సిందే. క్రిస్టియన్ మతంకు చెందిన సమంతతో నాగ చైతన్య హిందీ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సమంత సైతం హిందూ ధర్మంను ఆచరించడం మొదలు పెట్టింది. ఆమె మంగళ సూత్రం ధరించడం మొదలు హిందూ వివాహితగా చేయాల్సిన పనులు చేసింది. కాని కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడి పోయారు. ఇప్పుడు మరోసారి నాగ చైతన్యకు మంచి ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడటం జరిగిందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగబోతున్న వివాహంకు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. పెళ్ల తర్వాత రిసెప్షన్ ఉండక పోవచ్చు. కనుక పెళ్లిలోనే ప్రముఖులు పాల్గొంటారని తెలుస్తోంది. ఇక నాగ చైతన్య, శోభిత దూళ్లిపాల పెళ్లి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.50 కోట్లకు గాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం జరిగిందట. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ చైతూ, శోభితల ఇంటర్వ్యూలు తీసుకోవడంతో పాటు, షూటింగ్ మొదలు పెట్టిందని తెలుస్తోంది. పెళ్లి అయిన నెల లోపే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నారట. ఇక నాగ చైతన్య తండేల్ సినిమాతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.