తండేల్ చివరి అరగంట గురించి నాగ చైతన్య..!
నాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న తండేల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
By: Tupaki Desk | 6 Feb 2025 5:32 PM GMTనాగ చైతన్య సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న తండేల్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. ఐతే అల్లు అరవింద్ కూడా ఈ సినిమా నిర్మాణాన్ని దగ్గర ఉండి చూసుకున్నారని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ వల్ల తండేల్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సినిమాకు సాంగ్స్ తోనే హిట్ వైబ్ ఇచ్చాడు దేవి శ్రీ ప్రసాద్.
ఇక ఈ సినిమా కొద్ది గంటల్లో రిలీజ్ ఉండగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా గురించి మరిన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. నాగ చైతన్య తండేల్ గురించి చెబుతూ ఈ సినిమా చివరి అరగంట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అన్నారు. సినిమా తప్పకుండా ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుందని. తండేల్ ఒక మంచి లవ్ స్టోరీ అని ఈ సినిమా కోసం టీం అంతా ఏడాదిన్నర పాటు చాలా కష్టపడ్డామని అన్నారు.
తండేల్ సినిమాలో మొదటి నుంచి నాగ చైతన్య అప్రోచ్ చాలా కమిటెడ్ గా ఉంది. ఈ సినిమాలో తండేల్ రాజు పాత్రని చైతన్య చాలా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నాడు. అంతేకాదు వారి ప్రాంతానికి వెళ్లి అక్కడ వారితో కలిసి పాత్రకు కావాల్సిన క్యారెక్టరైజేషన్ ని బిల్డ్ చేసుకున్నాడు. సో నాగ చైతన్య మాత్రమే కాదు తండేల్ సినిమా విషయంలో అతని వర్క్ గురించి అందరు చెబుతున్న మాట వింటే ఇది అతని బెస్ట్ అని అనేయొచ్చు.
ఇక ఈ ప్రెస్ మీట్ లో నాగార్జున గారు తండేల్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదని అంటే.. సక్సెస్ మీట్ లో ఆయనను తీసుకొచ్చే ప్లాన్ ఉందని అన్నారు నాగ చైతన్య. అంతేకాదు సినిమాకు వస్తున్న ఈ పాజిటివ్ బజ్ చూసి ఆయన సంతోషంగా ఉన్నారని అన్నారు నాగ చైతన్య. చూస్తుంటే చైతన్యకి కూడా ఈ సినిమా తనకు బెస్ట్ హిట్ ఇస్తుందనే నమ్మకం కలిగినట్టు ఉంది. నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ ఇప్పటికే లవ్ స్టోరీ హిట్ అందుకోగా తండేల్ మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేలా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా లెక్క తేల్చేలా ఉంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది కొద్ది గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది.