Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ చేస్తా: నాగ చైతన్య

దీంతో చైతూ ఫ్యాన్స్, బన్నీ అభిమానులు తెగ స్పందిస్తున్నారు. మల్టీస్టారర్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 2:28 PM GMT
అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ చేస్తా: నాగ చైతన్య
X

సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్స్ కు స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. స్క్రీన్ పై ఒకరికన్నా ఎక్కువ మంది హీరోలు కనిపిస్తే మూవీ లవర్స్ తో పాటు ఆయా హీరోల ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. అదే సమయంలో కొత్త కాంబోలు రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. అందుకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి.

అయితే తాజాగా హీరో నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఛాన్స్ వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ చేస్తానని తెలిపారు. ఈ మేరకు తన అప్ కమింగ్ మూవీ తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన నాగ చైతన్య అండ్ టీమ్... పలు ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నారు.

ఆ సమయంలో తమ్ముడు అఖిల్‌, అల్లు అర్జున్‌.. వీరిద్దరిలో అవకాశం వస్తే ఎవరితో మల్టీస్టారర్‌ చేస్తారని హోస్ట్ ప్రశ్నించారు. తాను, అఖిల్‌ కలిసి మనం సినిమాలో కనిపించామని చైతూ తెలిపారు. అందుకే అల్లు అర్జున్‌తో చేస్తానని ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం చైతూ కామెంట్స్ సోషల్ మీడియా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

దీంతో చైతూ ఫ్యాన్స్, బన్నీ అభిమానులు తెగ స్పందిస్తున్నారు. మల్టీస్టారర్ కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. రేపు ఆ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది.

అయితే ఇంటర్వ్యూలో చైతూ.. తండేల్ మూవీ గురించి కూడా మాట్లాడారు. "చందూ గైడెన్స్ లో సినిమా అంతా చేశా. జరిగిన కథ ఆధారంగా తీసిన మూవీ ఇది. రియల్ లైఫ్ లో రాజు క్యారెక్టర్ కు దూరంగా ఉంటా. వాళ్ళ లైఫ్ స్టైల్ కు చాలా దూరంగా ఉంటా. శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో స్పెండ్ చేసి.. మాట్లాడా.. తెలుసుకున్నా.. అది నాకు బాగా హెల్ప్ అయింది" అని తెలిపారు.

పాకిస్థాన్ ఎపిసోడ్ కథలో ఉందని అని చైతూ తెలిపారు. "సినిమా కోసం పాక్ ఎపిసోడ్ క్రియేట్ చేయలేదు. ఒక యాక్టర్ కు మంచి కంటెంట్ దొరికితే మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. సినిమాలో ప్రతి ఎపిసోడ్ ఛాలెంజింగ్ గా ఉండేది. సముద్రంలో చాలా వరకు మూవీ షూట్ చేశాం. అది ఈజీ కాదు. షెడ్యూల్ కు షెడ్యూల్ కు మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకునేవాళ్లం" అని నాగ చైతన్య చెప్పారు.