గంటకు 240 కి.మీ.. నాగచైతన్య రేసింగ్ స్పీడ్?
మోటార్ స్పోర్ట్స్ పై అక్కినేని నాగచైతన్యకు ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 4 Sep 2024 6:11 PM GMTమోటార్ స్పోర్ట్స్ పై అక్కినేని నాగచైతన్యకు ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అతడికి కార్ రేసింగ్ అంటే చాలా ఆసక్తి. అతడి గ్యారేజీలో లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు కొదవే లేదు. ఇప్పుడు చెన్నైలో రేసింగ్ కి అటెండయిన చైతూ అక్కడ బోలెడంత సందడి చేస్తున్నాడు.
నాగ చైతన్య ఇటీవల చెన్నైలో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (IRF) నైట్ స్ట్రీట్ రేసింగ్ పోటీ ఉత్సవాల్లో పాల్గొన్నప్పుడు మోటార్‌స్పోర్ట్‌పై తన ప్రేమ గురించి ఓపెనయ్యాడు. లీగ్‌లోని ఎనిమిది జట్లలో ఒకటి నాగ చైతన్య సొంతం. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ అతడి టీమ్ పేరు దీంతో స్ట్రీట్ రేసింగుకి అతడి ప్రచారం హోరెత్తుతోంది. దేశంలో నైట్ స్ట్రీట్ అభిమానులను మోటార్‌స్పోర్ట్‌కి మరింత చేరువ చేస్తుందని చైతన్య అంటున్నారు. చెన్నైలో సంచలనాత్మక రేసింగ్ షోలో భాగమైనందుకు తన ఉత్సాహాన్ని షేర్ చేసాడు.
``నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను చాలా చిన్నప్పటి నుండి మోటార్‌స్పోర్ట్ అభిమానిని. చెన్నైలో స్ట్రీట్ సర్క్యూట్‌ను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది!`` అని హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ యజమాని నాగ చైతన్య అన్నారు. ఇది రేసింగ్ క్రీడను ప్రజలకు చేరువ చేస్తుందని నేను భావిస్తున్నాను. వీధుల్లో నగరం నడిబొడ్డున ఉన్నప్పుడు ప్రజల్లోకి శక్తిని ప్రసరింపజేస్తుంది. వారు రేస్ ట్రాక్‌కి చాలా దగ్గరగా ఉంటారు.. రేసింగ్‌ను ప్రజలకు మరింతగా చేరువ చేస్తుంది! అని అన్నారు. మోటార్ రేసింగ్ ఒక క్రీడగా ప్రజల మనస్సులలో ఉంది. ప్రజలు F1ని చూస్తారు. అది ఇతర నగరాలకు ఎంత ఎక్కువ వెళ్తుందో అంతగా సమాజాన్ని ఒకచోట చేర్చి క్రీడను మరింత పెద్దదిగా చేయబోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కే పరిమితం. ఇప్పుడు ఇతర నగరాలకు విస్తరిస్తోంది అని అన్నారు.
ఈ రేసింగ్ లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఒక్కొక్కటి విభిన్నమైన డ్రైవర్ల శ్రేణి ని కలిగి ఉన్నాయి. బెంగళూరు స్పీడ్‌స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, గోవా ఏసెస్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, రహర్ బెంగాల్ టైగర్స్ వంటి జట్లు పోటీపడుతున్నాయి. రేస్ కార్లు సర్క్యూట్ ను డ్రోన్స్ తో షూట్ చేస్తుండడం ఆసక్తికరం. ఆదివారం జరిగే రేసులో తన టీమ్ ఒత్తిడికి గురికాకుండా చూసుకున్నాడు నాగ చైతన్య.
నేను వారిపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలని కోరుకోవడం లేదు. బ్లాక్ బర్డ్స్ ఈ ట్రాక్‌పై డ్రైవింగ్ చేయడం ఇదే మొదటిసారి. కాబట్టి వారు దీని గురించి తెలుసుకోవాలి. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను! అని చైతన్య చెప్పాడు. అన్నా సాలై - శివానంద సాలై సహా సర్క్యూట్ చుట్టూ ఉన్న వివిధ గ్రాండ్‌స్టాండ్‌ల నుండి ప్రేక్షకులు ఈవెంట్‌ను ఆస్వాధించారు. IRL FIA-సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ (F4IC)ని కలిగి ఉంది, ఇందులో వోల్ఫ్ థండర్ GB08 రేసింగ్ కార్లు గంటకు 240 కి.మీ. వరకు వేగానికి చేరుకోగలవు.