నాగ చైతన్యకు డార్లింగ్..బేబిలంటే నచ్చవంట!
అయితే ఇలాంటి వాటికి యువ సామ్రాట్ నాగచైతన్య మాత్రం పూర్తిగా వ్యతిరేకం. కొనుక్కున్న కార్లుకు డార్లింగ్..బేబి అంటూ ముద్దు పేర్లు పెట్టుకుని పిలుచుకోవడం తనకెంత మాత్రం ఇష్టం ఉండదు అన్నాడు.
By: Tupaki Desk | 8 Dec 2024 8:36 AM GMTఇష్టపడి కొనుక్కున్న కార్లకు..వస్తువులకు ముద్దు పేర్లు పెట్టుకోవడం సహజం. కంపెనీ ఇచ్చిన బ్రాండ్ నేమ్ ని వదిలేసి కొత్త పేర్లతో పిలుచుకోవడం అన్నది చాలా మందికి అలవాటు. కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు కాబట్టి అలా అభిమానంతో నచ్చిన ముద్దు పేరు పెట్టుకుని పిలుచుకుంటారు. అయితే ఇలాంటి వాటికి యువ సామ్రాట్ నాగచైతన్య మాత్రం పూర్తిగా వ్యతిరేకం. కొనుక్కున్న కార్లుకు డార్లింగ్..బేబి అంటూ ముద్దు పేర్లు పెట్టుకుని పిలుచుకోవడం తనకెంత మాత్రం ఇష్టం ఉండదు అన్నాడు.
కంపెనీ బ్రాండ్...ఆ సంస్థ పేరే హైగా ఉంటుంది. దానికి కొత్తగా మనం పేరు పెట్టుకోవడం...అయి ఇష్టంతో పేరు మార్చడం వంటివి చేయడంట. కంపెనీ ఇచ్చిన పేరునే ఇష్టంగా భావించి ముందుకెళ్తానన్నాడు. తన దృష్టిలో అదే హై గా ఉంటుందన్నాడు. నాగచైతన్య గ్యారేజీలో ఇప్పటికే చాలా బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. చైతన్యకు
ఆటో మొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. కార్, బైక్ రేసింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.
ఇప్పటికే చైతూ వద్ద అనేక లగ్జరీ మోడల్ వెహికల్స్ ఉన్నాయి. ఇటీవలే తనకు ఇష్టమైన రేసింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. దీంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) ఆధ్యర్యంలో జరిగే ఫార్ములా 4లో భాగమయ్యాడు. నిజానికి చైతన్యకు ఫార్ములావన్ అంటే చాలా క్రేజీ. బుల్లెట్ లా దూసుకుపోయే ఈ కారు రేసింగ్ చూసేందుకు ప్రతిసారి సీజన్లలో పాల్గొంటారు.
ఇప్పటికే చైతూ వద్ద సూపర్ కార్స్, కొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లను తన గ్యారేజీలో పెట్టుకున్నాడు. మార్కెట్ లోకి కొత్త టెక్నాలజీతో ఏ కారు వచ్చినా కొనుగోలు చేయడం అలవాటు. వాటిని టెస్ట్ డ్రైవ్ చేస్తుంటారు. కల్కి సినిమా కోసం నాగ్ అశ్విన్ మహీంద్రా సంస్థతో తయారు చేయించిన కార్లను సైతం చైతన్య టెస్ట్ డ్రైవ్ చేసిన సంగతి తెలిసిందే.