టాలీవుడ్ లో నెగిటివ్ పీఆర్‌పై చైతన్య షాకింగ్ కామెంట్స్
ఆ పాడ్‌కాస్ట్ లో నాగ చైతన్య టాలీవుడ్ లో నెగిటివ్ ప్రమోషనల్ క్యాంపైన్ ను గుర్తించినట్టు తెలిపాడు.
By: Tupaki Desk | 8 Feb 2025 5:48 AM GMTటాలీవుడ్ యంగ్ హీరోల్లో అందరూ ఇష్టపడే హీరోగా అక్కినేని నాగ చైతన్య ముందు వరుసలో ఉంటాడు. అతనికి పెద్దగా హేటర్స్, నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఉండరు. అలాగే చైతన్య కూడా తనకు తానుగా ఏ హీరో గురించి కానీ, వారి యాక్టింగ్ గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడింది లేదు. తన పని తాను చేసుకుంటూ సింపుల్ గా ఉండే చైతన్య, తన కెరీర్ కూడా సాఫీగా సాగేలా చూసుకోవాలని భావిస్తుంటాడు.
అయితే నాగ చైతన్య తండేల్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ పాడ్‌కాస్ట్ లో నాగ చైతన్య టాలీవుడ్ లో నెగిటివ్ ప్రమోషనల్ క్యాంపైన్ ను గుర్తించినట్టు తెలిపాడు. టాలీవుడ్ లో జరిగే టార్గెటెడ్ నెగిటివిటీని చైతన్య ఈ సందర్భంగా ప్రస్తావించి దానిపై మాట్లాడాడు.
టాలీవుడ్ లో కొంతమంది కావాలని నెగిటివ్ పీఆర్ లు ప్రచారం చేయిస్తున్నారని, వారి టార్గెట్ వేరే హీరోల సినిమాలను నాశనం చేసి వారి గొంతు నొక్కడమేనని చైతన్య వెల్లడించాడు. అయితే ఈ నెగిటివ్ పీఆర్ లు చేయిస్తుంది ఏ హీరోలు? ఏ పీఆర్ టీమ్ ఈ నెగిటివ్ ప్రమోషన్స్ ను చేస్తుందనేది మాత్రం చైతన్య చెప్పలేదు.
టాలీవుడ్ లో నెగిటివ్ పీఆర్ ఉందని మాత్రం నాగ చైతన్య చాలా స్ట్రాంగ్ గా క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, అసలు ఈ నెగిటివ్ పీఆర్ చేసి వేరే హీరోల సినిమాలను నాశనం చేయడానికి ప్రయత్నించడం వల్ల వారికి ఎలాంటి లాభమొస్తుందో తనకు అర్థం కావడం లేదని, ఆ నెగిటివ్ పీఆర్ కు ఉపయోగించే డబ్బుని వారు తమ వర్క్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికో లేక ఏదైనా హాలిడే ట్రిప్స్ కోసమో ఎందుకు ఖర్చు పెట్టుకోరనిపిస్తుందని చైతన్య అన్నాడు.
ఎవరైనా ఒక సినిమా తీస్తే దానికి పబ్లిసిటీ కచ్ఛితంగా అవసరమని, అది ఓ అలవాటైపోయిందని, పబ్లిసిటీకి కచ్ఛితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని కూడా ఈ సందర్భంగా చైతన్య వెల్లడించాడు. చైతన్య లాంటి హీరో నెగిటివ్ పీఆర్ ట్రెండ్ గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.