Begin typing your search above and press return to search.

చైతూ ఇంత కాన్ఫిడెంట్‌గా మొదటి సారి..!

నాగ చైతన్య తన గత చిత్రాల ప్రమోషన్స్‌ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 11:30 AM GMT
చైతూ ఇంత కాన్ఫిడెంట్‌గా మొదటి సారి..!
X

'కస్టడీ' సినిమా తర్వాత గ్యాప్‌ తీసుకున్న నాగ చైతన్య 'తండేల్‌' సినిమాతో రేపు రాబోతున్నారు. గత ఏడాది ఒక్క సినిమా విడుదల చేయలేక పోయిన నాగ చైతన్య ఈ సినిమాతో ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేసే విధంగా హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021లో లవ్‌ స్టోరీ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న నాగ చైతన్య మళ్లీ ఇప్పటి వరకు హిట్‌ కొట్టలేక పోయాడు. లవ్‌ స్టోరీ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో పాటు, కార్తికేయ 2 సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందడంతో 'తండేల్‌' సినిమాకి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

నాగ చైతన్య తన గత చిత్రాల ప్రమోషన్స్‌ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఒకటి రెండు ఇంటర్వ్యూలు, ఒకటి రెండు మీడియా సమావేశాలు, ఒక ఈవెంట్‌ మినహా పెద్దగా కనిపించరు. కానీ తండేల్‌ సినిమా కోసం నాగ చైతన్య చాలా దూరం వెళ్లారు. సినిమా ప్రారంభం కాకముందే శ్రీకాకుళం, వైజాగ్ వెళ్లి అక్కడి వారి జీవన శైలి తెలుసుకుని, వారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నారు. దాదాపు ఎనిమిది నెలల పాటు తండేల్‌ కోసం గ్రౌండ్‌ వర్క్ జరిగింది. కష్టపడి చేసిన సినిమాలపై కచ్చితంగా నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ నమ్మకమే నాగ చైతన్యలో కనిపిస్తుంది. ఆయన మాటలతో తన నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా నాగ చైతన్య తన సినిమాల గురించి భారీ హైప్‌ ఇచ్చే విధంగా ఆహా.. ఓహో అన్నట్లుగా మాట్లాడరు. కానీ తండేల్‌ విషయంలో మాత్రం ఆయన మాట్లాడుతున్న మాటలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా ఆయన ఒక చిట్‌చాట్‌లో మాట్లాడుతూ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది, శ్రీకాకుళంలో సక్సెస్‌ మీట్‌ను నిర్వహిస్తామని చాలా ధీమాగా అన్నారు. చాలా తక్కువ మంది హీరోలు, తమ సినిమాపై ఎక్కువ నమ్మకం ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సక్సెస్ మీట్‌లో కలుద్దాం అని మాట వరసకు అంటూ ఉంటారు. కానీ నాగ చైతన్య ఏకంగా శ్రీకాకుళంలో సక్సెస్‌ మీట్‌ అంటూ ప్లేస్‌ని సైతం ఖరారు చేసి ప్రకటించారు.

నాగ చైతన్య కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశారు, అయితే ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న సినిమా ఇదే అయ్యి ఉంటుందని అక్కినేని ప్యాన్స్‌ అంటున్నారు. ప్రతి సినిమా విషయంలోనూ హీరోలు నమ్మకంతో ఉంటారు. విడుదల సమయంలో కాస్త అటు ఇటు అయినా ఫలితం పాజిటివ్‌గా వస్తుందని అనుకుంటారు. కానీ తండేల్‌ విషయంలో నాగ చైతన్య ఆలోచన అస్సలు నెగటివ్ వైపు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఆయన పెళ్లి తర్వాత చాలా పాజిటివ్‌ ఎనర్జిని మూట కట్టుకున్నట్లుగా ఉన్నారు. అందుకే వెళ్లిన ప్రతి చోట చాలా కాన్ఫడెంట్‌తో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మధ్య ట్రైలర్‌ లాంచ్‌ కోసం వైజాగ్‌ వెళ్లిన సమయంలో కచ్చితంగా విజయం సాధిస్తుంది, మంచి వసూళ్లు ఇవ్వాలంటూ అక్కడి వారిని కోరిన విషయం తెల్సిందే. ఇంత నమ్మకంగా నాగ చైతన్య కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు తండేల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.