యువ సామ్రాట్ ఇక మరింత జాగ్రత్తగా!
'తండేల్' విజయంతో అక్కినేని ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. నాగచైతన్య కెరీర్లో ఇలాంటి సోలో సక్సెస్ ఒక్కటి కావాలని ఎంతో కాలం నుంచి అక్కినేని ఫ్యామిలీ, అభిమానులు ఆశిస్తున్నారు.
By: Tupaki Desk | 12 Feb 2025 8:30 AM GMT'తండేల్' విజయంతో అక్కినేని ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. నాగచైతన్య కెరీర్లో ఇలాంటి సోలో సక్సెస్ ఒక్కటి కావాలని ఎంతో కాలం నుంచి అక్కినేని ఫ్యామిలీ, అభిమానులు ఆశిస్తున్నారు. ఆ దాహం 'తండేల్' తీర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సినిమా 75కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇంకొన్నిరోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరిపోతుంది. దీంతో అక్కినేని కాంపాండ్ లో తొలి సెంచరీ నమోదవుతుంది. అందుకే నాగార్జున సైతం ఎంతో సంతోషంగా ఉన్నారు.
అఖిల్...నాగార్జున ఇంకా ఆ రికార్డు సాధించకపోయినా పెద్ద కుమారుడు సాధిస్తున్నాడు అన్న సంతోషం కింగ్ మాటల్లో కనిపిస్తుంది. ఈ విషయంలో అటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా అంతే సంతోషంగా ఉంది. రామానాయుడు మనవడిగా, వెంకటేష్, సురేష్ బాబు మేనల్లుడిగా చైతన్య సక్సెస్ విషయంలో వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. అక్కినేని అభిమానుల ఆనందానికైతే అవదుల్లేవ్. అయితే ఇలాంటి భారీ విజయం నేపథ్యంలో నాగచైతన్య మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ సక్సెస్ చైతన్యపై బాధ్యత పెంచింది. తదుపరి ఏ డైరెక్టర్ తో పనిచేసినా ఎలాంటి కథలో నటించినా అది పాన్ ఇండియాలో సంచలనం అయ్యేలా ఉండాలి. ఎందుకంటే? తండేల్ తో చైతన్య పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టాడు. ఆ సక్సెస్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయాలి. ఇదంత సులభం కాదు. స్టోరీల విషయంలో చాలా సెలక్టివ్ గా ఉండాలి. డైరెక్టర్ల విషయంలో మరింత మెరుగ్గా ఉండాలి.
ప్రతిభావంతుల్ని వెతికి పట్టుకోవాలి. అప్పుడే చైతన్య పాన్ ఇండియాలో తన మార్కెట్ ని కాపాడుకోగలడు. వైఫల్యాలు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందన్నది నాగచైతన్య ఇప్పటికే చాలా అనుభవం ఉంది. ఇప్పటికే చైతన్యతో మరో సినిమా చేస్తానని చందు మొండేటి ప్రకటించాడు. ఏఎన్నార్ నటించిన `తెనాలి రామకృష్ణ` చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు తీస్తానంటున్నాడు. ఐడియా బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అన్నది అంతే ఇంపార్టెంట్.