నాగచైతన్య ఇద్దరు మరదళ్లను చూసారా?
అయితే ఇప్పుడు నాగచైతన్య తన మరదలితో సరసమాడుతున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 12 Dec 2024 4:23 AM GMTఅక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాల ప్రేమాయణం, పెళ్లి గురించి తెలిసిందే. కొద్దిమంది బంధుమిత్రులు, సినీ ప్రముఖుల మధ్య చై-శోభిత వివాహం ఈ డిసెంబర్ 5న సింపుల్ గా జరిగింది. సమంత నుంచి బ్రేకప్ తర్వాత శోభిత- చైతన్య ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని ప్రచారమైంది. ఈ జంట ఇరు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో పెళ్లాడారు. ఈ ప్రేమపెళ్లికి పెద్దల ఆశీర్వాదం దక్కడంతో ఆ ఆనందం లవ్ కపుల్ లో స్పష్ఠంగా కనిపించింది. ఈ సెలబ్రిటీ పెళ్లి వేడుకకు సంబంధించిన చాలా ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అయితే ఇప్పుడు నాగచైతన్య తన మరదలితో సరసమాడుతున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇంతకీ నాగచైతన్యకు మరదలు ఉందా? శోభితకు సిస్టర్ ఉన్నారా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే శోభితకు ఒక సోదరి ఉన్నారు. కానీ ఇక్కడ వీడియోలో చైతన్యతో కనిపించిన మరదలు వేరే. తన పేరు మాళవిక ఈ అమ్మాయి దగ్గుబాటి కుటుంబానికి చెందిన అమ్మాయి. దగ్గుబాటి సురేష్ బాబు కుమార్తె. దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్ ల సోదరి. మాళవికకు కూడా పెళ్లయి పిల్లలు ఉన్నారు.
అయితే దగ్గుబాటి అమ్మాయి నాగచైతన్యకు మరదలు వరుస. దగ్గుబాటి కుటుంబంతో నాగచైతన్య రిలేషన్‌షిప్ గురించి తెలిసిందే. దివంగత నిర్మాత డా.డి.రామానాయుడు కుమార్తె, దగ్గుబాటి సురేష్ బాబు సోదరి లక్ష్మి దగ్గుబాటి అక్కినేని నాగార్జున మొదటి భార్య అన్న సంగతి తెలిసిందే. నాగార్జున-లక్ష్మి దంపతుల కుమారుడు నాగచైతన్య. ఆ రకంగా చూస్తే సురేష్ బాబు కుమార్తె నాగచైతన్యకు మరదలు అవుతుంది. ఆ ఇద్దరి నడుమా బావ మరదళ్ల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. బావ మరదళ్లు ఓ చోట కలిసి కనిపిస్తే అక్కడ బోలెడంత సందడి ఉంటుంది. సరదా పరిహాసాలతో ఫన్నీ వాతావరణం కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ దగ్గుబాటి రానా హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న టాక్ షోలో ఈ సందడి బయటపడింది. ఈ షోటోలో రానా భార్య, సురేష్ బాబు కూతురుతో పాటు నాగచైతన్య సందడి చేసారు.
రానా టాక్ షోలో మాళవిక ఎంతో జోవియల్ గా కనిపించారు. నాగ చైతన్యను మరదలి పిల్ల బావా బావా అని పిలుస్తుంటే వాతావరణం సందడిగా కనిపించింది. మరదలితో నాగచైతన్య పరిహాసం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. టాక్ షోలో బావా మరదలి సరసం ఆడియెన్‌ని కట్టి పడేసింది.
నాగచైతన్యకు మరో అందమైన మరదలు కూడా ఉన్నారు. తన భార్య శోభిత చెల్లెలు పేరు యాధృచ్ఛికంగా సమంత. సమంత ధూళిపాల పిండం వైద్యం(ఫెటల్ మెడిసిన్)లో నైపుణ్యం కలిగిన వైద్య నిపుణురాలు. ఆమె న్యూఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఫీటల్ మెడిసిన్ (రేడియాలజీ)లో అటెండింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. సమంత గతంలో ప్లాటినం ఇమేజింగ్ సెంటర్‌లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా పనిచేసింది.
సమంత పూణేలోని పద్మశ్రీ డా.డి.వై.పాటిల్ మెడికల్ కాలేజ్ నుండి రేడియాలజీలో ఎం.డి. ఆమె డాక్టర్ సాహిల్ గుప్తాను వివాహం చేసుకున్నారు. సమంత ధూళిపాల ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు.