'బాహుబలి' మేకర్స్ తో నాగచైతన్య హారర్ కామెడీ..?
ప్రముఖ నిర్మాత సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో నాగ చైతన్య ఓ సినిమాకి సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Jan 2025 8:30 AM GMTఅక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో డిఫరెంట్ జోనర్స్ లో అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 'తండేల్' వంటి సర్వైవల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న చైతూ.. ఇటీవలే 'NC 24'గా ఓ మైథలాజికల్ థ్రిల్లర్ ను అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ నిర్మాత సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ లో నాగ చైతన్య ఓ సినిమాకి సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదొక హారర్ కామెడీ అని, ఈ మూవీతో ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. 'వేదం' 'మర్యాద రామన్న' 'బాహుబలి 1' 'బాహుబలి 2' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియా.. తమ ప్రొడక్షన్ లో సోలోగా ప్రాజెక్ట్ టేకాఫ్ చేసి చాలా ఏళ్లయింది. కొన్ని వెబ్ సిరీసులు, టీవీ సీరియల్స్ చేసారు కానీ, సినిమాలు నిర్మించలేదు.
అయితే ఆ మధ్య ఎస్.ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా బ్యానర్ లో 'ఆక్సిజన్' & 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అనే రెండు చిత్రాలను అనౌన్స్ చేసారు. ఇవి ఎక్కడి దాకా వచ్చాయేది తెలియదు కానీ, ఈ క్రమం నాగచైతన్యతో హారర్ కామెడీ సినిమా చేయడానికి నిర్మాత శోభు యార్లగడ్డ రెడీ అయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే నిజమైతే 'బాహుబలి' మేకర్స్ తో అక్కినేని యువసామ్రాట్ చేయబోయే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
'దూత' వెబ్ సిరీస్ తో సక్సెస్ ఫుల్ గా డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. వేటికవే ప్రత్యేకమైన జోనర్లలో సినిమాలను ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' మూవీ చేస్తున్నారు. ఇది చై కెరీర్ లోనే కాస్ట్లీ ప్రాజెక్ట్.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అల్లు అరవింద్ సమ్పరిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
చైతన్య తన 24వ చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో చేస్తున్నారు. దీంట్లో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'NC 24' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ ఓ సినిమా కమిట్ అయ్యారని సమాచారం. కొత్త ఏడాదిలో ఈ చిత్రాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. అలానే విక్రమ్ కె కుమార్ తో 'దూత 2' వెబ్ సిరీస్ చై లైనప్ లో ఉందనే సంగతి తెలిసిందే.