Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో.. ఇదేం లైనప్ బాబోయ్..!

అక్కినేని హీరోల్లో కింగ్ నాగార్జున సోలో కథలు దొరక్క మల్టీస్టారర్స్ తో సరిపెడుతున్నాడు. అది కూడా తమిళ సినిమాల్లో వరుసగా రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   30 Dec 2024 8:30 AM GMT
అక్కినేని హీరో.. ఇదేం లైనప్ బాబోయ్..!
X

అక్కినేని హీరోల్లో కింగ్ నాగార్జున సోలో కథలు దొరక్క మల్టీస్టారర్స్ తో సరిపెడుతున్నాడు. అది కూడా తమిళ సినిమాల్లో వరుసగా రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఆ సినిమాల్లో ఒకటి తెలుగు దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న సినిమా అయినా కూడా నాగార్జున రోల్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. మరోపక్క అఖిల్ ఏజెంట్ వచ్చి రెండు ఏళ్లు దగ్గర పడుతున్నా తన నెక్స్ట్ సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. తన లుక్స్ తో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచుతున్నా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో డీలా పడుతున్నారు.

ఐతే ఈ ఇద్దరు అలా ఉంటే యువ సామ్రాట్ నాగ చైతన్య మాత్రం సినిమా వెంట సినిమాతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు తెలుగు హీరోల్లో ఏ హీరో కూడా వెబ్ సీరీస్ లకు మొగ్గు చూపలేదు కానీ ధూత వెబ్ సీరీస్ తో నాగ చైతన్య సూపర్ హిట్ అందుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ త్వరలో ధూత 2 ని ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2025 ఫిబ్రవరి రిలీజ్ ప్లాన్ చేశారు.

ఈ సినిమా తర్వాత విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. అది కూడా థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తుందని తెలుస్తుంది. ఐతే లేటెస్ట్ గా బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా కూడా చైతన్యతో ఒక సీరీస్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అది కూడా థ్రిల్లర్ కథాంశంతోనే వస్తుందని తెలుస్తుంది. సో నాగ చైతన్య లైనప్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తుందని చెప్పొచ్చు.

తనకు సూటయ్యే కథలతో నాగ చైతన్య ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు, సీరీస్ లు చేస్తున్నాడు. సినిమాలైనా కూడా కలెక్షన్స్ లెక్క ఉంటుంది కానీ వెబ్ సీరీస్ లతో అయితే జస్ట్ క్లిక్ అయితే చాలు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. ధూత చేయడం చైతన్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ధూత 2 తో పాటుగా ఆర్కాతో మరో వెబ్ సీరీస్ కు రెడీ అవుతున్నాడు. అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే తన దూకుడుతో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడని చెప్పొచ్చు.