Begin typing your search above and press return to search.

'ఎన్' క‌న్వెన్ష‌న్ కూల్చివేత గురించి చైత‌న్య ఏమ‌న్నారంటే?

నాగ చైత‌న్య‌-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్దం ఇటీవ‌ల కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Aug 2024 5:40 AM GMT
ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చివేత గురించి చైత‌న్య ఏమ‌న్నారంటే?
X

నాగ చైత‌న్య‌-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్దం ఇటీవ‌ల కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే పెళ్లి తేదీగానీ, వేదిక గానీ ఎక్క‌డా ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌ర్ లో వివాహం రాజాస్తాన్ లో జ‌రుగుతుంద‌ని ఓ ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వివాహం కూడా సింపుల్ గానే ఎలాంటి హ‌డావుడి లేకుండా ఉంటుంద‌ని వార్త‌లొస్తున్నాయి.

తాజాగా ఈ సందేహాల‌న్ని చైత‌న్య ముందుకు దృష్టికి తీసుకెళ్తే ఆయ‌న స్పందించారు. పెళ్లి వేదిక‌, ఇత‌ర వివ‌రాల‌న్నీ స్వ‌యంగా త‌నే త్వ‌ర‌లో చెబుతాన‌న్నారు. అలాగే వివాహం కేవ‌లం స‌న్నిహితుల స‌మ‌క్షంలో జ‌రిగినా అది గ్రాండ్ గా ఉంటుంద‌న్నారు. దీంతో వెన్యూ ఇంకా క‌న్ప‌మ్ అయిన‌ట్లు లేద‌ని తెలుస్తోంది. మ‌రి అందుకు రాజ‌స్తాన్ వేదిక అవుతుందా? హైద‌రాబాద్ అడ్డ‌గా జ‌రుగుతుందా? ఈ రెండు గాక విదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్లాన్ చేసారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

అలాగే నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ కూల్చి వేత‌పై ప్ర‌శ్నించ‌గా... ఈ ఘటనపై తన తండ్రి నాగార్జున తన అభిప్రాయాన్ని వెల్లడించారన్నారు. మీడియా వేదిక‌గా ఆయ‌న వాస్త‌వాలు వెల్ల‌డించార‌న్నారు. దీనికి గురించి ప్ర‌త్యేకంగా తాను పెద్దగా మాట్లాడాల్సింది ఏం లేద‌న్నారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య క‌థానా య‌కుడిగా `తండేల్` తెరెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

పాన్ ఇండియాలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. చైత‌న్య తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావ‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. ఉత్త‌రాంద్ర తీర ప్రాంతంలో జ‌రిగిన వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చైత‌న్య‌కి జోడీగా సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది. చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంటుం ది. అన్ని ప‌నులు పూర్తి చేసి డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.