చైతన్య అప్పటి వరకు బిజీనా..?
అక్కినేని నాగ చైతన్య ఈమధ్యనే శోభిత ధూళిపాలను పెళ్లాడారు. పెళ్లైన ఈ రెండు వారాలు కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వచ్చిన ఈ జంట త్వరలో హనీమూన్ కి వెళ్తున్నారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 15 Dec 2024 1:30 AM GMTఅక్కినేని నాగ చైతన్య ఈమధ్యనే శోభిత ధూళిపాలను పెళ్లాడారు. పెళ్లైన ఈ రెండు వారాలు కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వచ్చిన ఈ జంట త్వరలో హనీమూన్ కి వెళ్తున్నారని తెలుస్తుంది. క్రిస్మస్ టైం లో చైతన్య, శోభిత ఫారిన్ వెళ్తారని జనవరి ఎండింగ్ వరకు అక్కడే ఉంటారని తెలుస్తుంది. జనవరి చివర్లో వచ్చి తండేల్ ప్రమోషన్స్ లో పాల్గొంటారని తెలుస్తుంది.
నాగ చైతన్య శోభితలు పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రియులను అలరించాయి. నాగ చైతన్య, శోభిత ఇద్దరు పెల్లికి ముందే కొన్నాళ్లు డేటింగ్ లో ఉన్నారు. ఐతే ఆ వ్యవహారాన్ని ఎక్కడ బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఐతే వారు షేర్ చేస్తున్న ఫోటోల వల్ల మీడియా కొన్ని వార్తలు రాసినా ఫైనల్ గా ఎంగేజ్ మెంట్ తో వారు షాక్ ఇచ్చారు.
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అంగరంగ వైభవంగా శోభిత పెళ్లి జరిగింది. ఈ పెళ్లిని కేవలం ఇరు కుటుంబాల బంధువులు వెల్ విషర్స్ మాత్రమే పాల్గొన్నారు. నాగ చైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసమే గుబురు గడ్డం పెంచాడు. తండేల్ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
తండేల్ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. 2025 శివరాత్రి కానుకగా తండేల్ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లో రిటర్న్ అవ్వాలని చూస్తున్న చైతన్య అప్పటి నుంచి తండేల్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. మరోపక్క శోభిత పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందా లేదా అన్న దాని మీద క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె వాణిజ్య ప్రకటనలు చేస్తుంది. వాటి ద్వారా బాగానే సంపాదిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన శోభిత ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ హౌస్ మేడ్ గా ఉంటుందా లేదా మళ్లీ ముఖానికి రంగేసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.