ఓటీటీ కంటెంట్‌కి ఆ టెన్షన్ ఉండదు : నాగచైతన్య
నాగ చైతన్య స్పందిస్తూ తప్పకుండా ముందు ముందు నా నుంచి మరిన్ని వెబ్ కంటెంట్ వస్తాయని హామీ ఇచ్చాడు.
By: Tupaki Desk | 7 Dec 2024 8:30 PM GMTఅక్కినేని నాగ చైతన్య ఇటీవల శోభిత ధూళ్ళిపాళతో ఏడు అడుగులు వేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఏయన్నార్ విగ్రహం ముందు నాగ చైతన్య, శోభితలు ఒక్కటి అయ్యారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీతో నాగ చైతన్య దంపతుల ఫోటోలు, దగ్గుబాటి ఫ్యామిలీతో నాగ చైతన్య దంపతుల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి అయిన వెంటనే శ్రీశైలంకు కొత్త దంపతులు స్వామి వారి దర్శనానికి వెళ్లారు. నాగ చైతన్య, శోభితలతో పాటు నాగార్జున సైతం ఉన్నారు.
ఒక వైపు నాగ చైతన్య, శోభిత పెళ్లి హంగామా కొనసాగుతూ ఉంటే మరో వైపు అమెజాన్ ప్రైమ్‌లో ఆయన గెస్ట్‌గా రానా టాక్ షో స్ట్రీమింగ్ అయ్యింది. పలు ఆసక్తికర విషయాలను రానాతో నాగ చైతన్య పంచుకున్నారు. సాయి పల్లవితో సినిమా అనుభవం గురించి మాట్లాడుతూ ఆమెతో డాన్స్ అంటే టెన్షన్‌గా ఉంటుందని అన్నాడు. ఆమె చిన్న విషయానికి కూడా రీ టేక్ అడుగుతుంది. ఆమెతో మళ్లీ మళ్లీ షాట్‌కి వెళ్లాల్సి ఉంటుంది అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఓటీటీ అనుభవంపై నాగ చైతన్య స్పందించాడు.
నాగ చైతన్య ఇప్పటికే ధూత అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఆ వెబ్ సిరీస్‌కి మంచి స్పందన వచ్చింది. ముందు ముందు మళ్లీ ఓటీటీ కంటెంట్ చేసే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించిన సమయంలో నాగ చైతన్య స్పందిస్తూ తప్పకుండా ముందు ముందు నా నుంచి మరిన్ని వెబ్ కంటెంట్ వస్తాయని హామీ ఇచ్చాడు. అంతే కాకుండా వెబ్ సిరీస్‌లు చేసిన సమయంలో టెన్షన్ ఉండదు అన్నాడు. సినిమా చేసినప్పుడు విడుదల, బుకింగ్, ప్రెస్‌మీట్‌లు, కలెక్షన్స్, శుక్రవారం టెన్షన్ ఉంటుంది. కానీ వెబ్ సిరీస్‌లకు అలా ఏమీ ఉండదు కనుక సినిమాలతో పాటు ముందు ముందు మరిన్ని వెబ్ సిరీస్‌లు చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌కి ప్రముఖంగా ప్రాధాన్యత ఉంది. కనుక ప్రపంచంతో ముందుకు వెళ్లాలి అంటే ఓటీటీ కంటెంట్ చేయాల్సిందే అన్నట్లుగా నాగ చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాను చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని వారం రోజుల్లో పూర్తి చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.