నాగ చైతన్య మాటల్లో తండేల్ కష్టం!
ఆఫ్ ది స్క్రీన్ లో స్క్రిప్ట్ సిద్దమైన తర్వాత అందుకు తగ్గట్లు హీరోలు తమని తాము మలుచుకోవడం కోసం జిమ్ముల్లోనూ అంతే శ్రమిస్తారు.
By: Tupaki Desk | 6 Feb 2025 7:52 AM GMTహీరోలు ఆన్ సెట్స్ లో ఎలా కష్ట పడతారో చెప్పాల్సిన పనిలేదు. సన్నివేశం డిమాండ్ చేసిందంటే రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం ఏ హీరో కూడా రాజీ పడకుండా నటిస్తారు. థియేటర్లో ప్రేక్షకుల్ని అలరించడం కోసం సినిమాని ఓ యజ్ఞంలో భావించి రేయింబవళ్లు పనిచేసి పూర్తి చేస్తారు. ఈ ప్రోసస్ లో ఎన్నో సవాళ్లు ఎదుర్కుం టారు. ఆఫ్ ది స్క్రీన్ లో స్క్రిప్ట్ సిద్దమైన తర్వాత అందుకు తగ్గట్లు హీరోలు తమని తాము మలుచుకోవడం కోసం జిమ్ముల్లోనూ అంతే శ్రమిస్తారు.
ఇలా పాత్రకు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ హీరో అన్ని విషయాల్లోనూ రాటు దేలాల్సిందే. 'దేవర' సినిమాలో గోవా సముద్రంలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతగా కష్టపడ్డాడో మాటల్లో రివీల్ చేస్తేనే షూటింగ్ అంటే ఇంత కష్టంగా ఉంటుందా? అనిపించింది. సముద్రం మధ్యలో తీవ్రమైన ఎండలో ఒక్క సీన్ షూట్ చేయడం ఓ నరకంగా భావించాడు తారక్. అలాంటింది 80 శాతం షూటింగ్ సముద్రంలో షూటింగ్ చేసిన హీరో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో గెస్ చేయోచ్చు.
తాజాగా అదే విషయాన్ని 'తండేల్' హీరో నాగచైతన్య రివీల్ చేసాడు. ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ మినహా షూటింగ్ అంతా సముద్రంలోనే చేసారు. సముద్రంలో ఎండ తీవ్రత భూమి కంటే అధికంగా ఉంటుంది. ఎండతో పాటు ఉప్పు నీటపై పడే ఎండ తో షూటింగ్ అంటే మరింత సవాల్ గానూ ఉంటుందన్నాడు. సన్నివేశాలు వాస్తవికంగా ఉండటం కోసం అలాంటి సవాళ్లు ఎన్నో ఎదుర్కుని షూటింగ్ చేసినట్లు చైతన్య తెలిపాడు. సన్నివేశంలో రియాల్టీ కనిపిం చాలంటే? సముంద్రంలో పడే వాస్తవ బాధ తెలిసినప్పుడే ఆసీన్ పర్పెక్ట్ వస్తుందని భావించి అలాగే షూట్ చేసినట్లు తెలిపాడు.
దాదాపు షూటింగ్ అంతా సముద్రంలోనే చేసారు. అవసరం మేర కొన్ని సన్నివేశాల కోసమే సెట్స్..మెట్స్ పైన ఆధారపడినట్లు తెలుస్తోంది. తారక్ ఒక్క సన్నివేశం కోసమే అంతగా ఇబ్బంది పడ్డాడు అంటే 80 శాతం షూటింగ్ అదే సముద్రంలో చేసిన చైతన్య ఇంకెంత ఇబ్బంది పడి ఉంటాడో గెస్ చేయోచ్చు. ఇదంతా సినిమాపై ఫ్యాషన్ తో ప్రేక్షకాభిమానుల్ని మెప్పించడం కోసమే చైతన్య అంతగా శ్రమించాడు.