కొత్త పెళ్లికొడుకుని సెల్పీ అడిగిన అభిమాని!
ఇరువురు కుటుంబ సభ్యులు అంతా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు
By: Tupaki Desk | 6 Dec 2024 9:27 AM GMTనాగ చైతన్య-శోభితల ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఇండస్ట్రీ సహా ప్రేక్షకాభిమానులంతా నవదంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేసారు. అయితే వివాహం అనంతరం కొత్త దంపతులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. నూతన వధువరూలతో పాటు నాగార్జున కూడా ఉన్నారు. ఇరువురు కుటుంబ సభ్యులు అంతా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు.
కొత్త దంపతులకు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహా ద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు. అయితే ఇక్కడ కూడా నాగచైతన్య దంపతుల్ని అభిమానులు విడిచి పెట్టలేదు. నాగచైతన్య-శోభిత నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఓ అభిమాని చైతన్యను పలకరించగా..ప్రతిగా చైతన్య కూడా హాయ్ అంటూ నవ్వుతూ పలకరించారు. ఇదే సమయంలో సదరు అభిమాని సెల్పీ అంటూ చిన్నగా అడుగుతుండగా ఇక్కడ కూడానా అంటూ చైతన్య నవ్వేసాడు.
ఆ పక్కనే ఉన్న శోభిత కూడా అంతే సరదాగా నవ్వారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో షాట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతంది. అదెంతో పన్నీగా ఉంది. దంపతుల్ని చూడటానికి వచ్చిన భక్తులంతా గుమిగూడారు. శోభిత చైతన్యను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శోభిత తెలుగింట అమ్మాయి. ముంబై వెళ్లి మోడలింగ్ ...బాలీవుడ్ సినిమాలు చేసినా తెలుగు సంప్రదాయాలు తెలిసిన అమ్మాయి. నేవీ కుటుంబం నుంచి వచ్చిన శోభిత ఎంతో క్రమ శిక్షణ కలిగింది. ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని పూజలు చేయడం...తెలుగు సంప్రదాయ పండగల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం అమెకు అలవాటు. ఇప్పుడు అక్కినేని కోడలిగా ఆ బాధ్యతలన్నీ ఆమెపైనే ఉన్నాయి.