పిక్ టాక్ : కొత్త జంట సంక్రాంతి సెలబ్రేషన్
ఈ సంక్రాంతి పండుగను అక్కినేని నాగ చైతన్య దంపతులు సైతం ఆనందంగా సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. నాగ చైతన్య సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించగా, శోభిత దూళిపాల చీర కట్టులో కనిపించింది.
By: Tupaki Desk | 15 Jan 2025 9:39 AM GMTసంక్రాంతి పండుగను టాలీవుడ్ స్టార్స్ తమ ఫ్యామిలీతో ఆనందంగా జరుపుకున్నారు. కొందరు సంక్రాంతి పండుగ వైబ్స్ అంటూ ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేశారు. సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన వారు చూపు తిప్పుకోనివ్వలేదు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సందర్భంగా దిగిన ఫోటోను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను ఆయన ఫ్యాన్స్ జాతీయ స్థాయిలో ట్రెండ్ చేశారు. ఇక క్లింకారతో కలిసి ఉన్న ఫోటోను రామ్ చరణ్, ఉపాసన దంపతులు షేర్ చేశారు. క్లింకార ఫేస్‌ను ఈ ఫోటోలోనూ రివీల్ చేయలేదు. అయినా చాలా క్యూట్‌గా రామ్ చరణ్ ఫ్యామిలీ ఫోటో ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సంక్రాంతి పండుగను అక్కినేని నాగ చైతన్య దంపతులు సైతం ఆనందంగా సాంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. నాగ చైతన్య సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించగా, శోభిత దూళిపాల చీర కట్టులో కనిపించింది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆకట్టుకునే విధంగా వీరి జోడీ ఉండటంతో వీరిద్దరిని కలిపి వెండి తెరపై చూడాలని కొందరు కోరుకుంటున్నారు. హీరో హీరోయిన్‌గా వీరిద్దరు కలిసి నటిస్తారా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న శోభిత త్వరలోనే టాలీవుడ్‌లోనూ బిజీ అయ్యే విధంగా సినిమాలు చేస్తానంటూ ఆ మధ్య చెప్పుకొచ్చింది. అయితే నాగ చైతన్యను వివాహం చేసుకున్న కారణంగా శోభితకు తెలుగులో ఎక్కువ ఆఫర్లు వచ్చే అవకాశం లేదు. బాలీవుడ్‌లోనే ఆమె సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకోవాల్సి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత శోభిత సినిమాలను మానేస్తుందనే పుకార్లు వచ్చాయి. కానీ ఆమె మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. కనుక మీడియాలో వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.
ఇక నాగ చైతన్య ప్రస్తుత సినిమా విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం ద్వారా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది అంటూ ఇప్పటికే వచ్చిన పాటలు చెప్పకనే చెబుతున్నాయి. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని భావించినా సాధ్యం కాలేదు.