ముంబై కేఫ్ లే కాదు..కర్ణాటక పార్కులు చుట్టేసిన జోడీ!
నాగచైతన్య-శోభిత ఇటీవల ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితులుగా మొదలై అటుపై ప్రేమకులై భార్యాభర్తలుగా మారారు
By: Tupaki Desk | 17 Dec 2024 9:52 AM GMTనాగచైతన్య-శోభిత ఇటీవల ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితులుగా మొదలై అటుపై ప్రేమకులై భార్యాభర్తలుగా మారారు. మరి ఈ జోడీ మొదటి సారి ఎలా కలిసారు? ఎక్కడ కలిసారు? వీళ్లను ప్రేమికుల నుంచి భార్యాభర్తలుగా మార్చడానికి గల కారణాలు ఏంటి? అంటే చాలా సంగతులే ఉన్నాయని తెలుస్తోంది. శోభిత 2022 నుంచి నాగచైతన్యను ఇన్ స్టాలో ఫాలో అవుతుందిట. ఇద్దరికీ ఫుడ్ అంటే ఇష్టమట. అలా ఇద్దర్నీ తొలిసారి ఫుడ్ కలిపింది. పుడ్ గురించి అభిప్రాయాలు పంచుకోవడం మొదలు పెట్టారు.
ఆ తర్వాత చైతన్య..శోభితను తెలుగులో మాట్లాడమని తరుచూ అడిగేవారుట. అలా తెలుగు మాట్లాడటం వల్ల బంధం మరింత బలంగా మారిందిట. అలాగే శోభిత ఇన్ స్టాలో పెట్టే గ్లామర్ ఫోటోలను కాకుండా ఆ కింద రాసే స్పూర్తివంతమైన కథనాలకు, అభిప్రాయాలకు సంబంధించిన వాటిని లైక్ చేసేవారుట. ఆ తర్వాత ముంబైలోని ఓ కేఫ్ లో చైతన్యను శోభిత కలిసిందిట. అప్పుడు చైతన్య హైదరాబాద్ లో...శోభిత ముంబైలో ఉన్నట్లు తెలిపింది.
తన కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ముంబై వచ్చాడుట. తొలిసారి కలుసుకున్నప్పుడు శోభిత రెడ్ డ్రెస్ లో..చైతన్య బ్లూ సూట్ లోఎ ఉన్నాడుట. ఆ తర్వాత కర్ణాటకలోని ఓ పార్క్‌కు వెళ్లారుట. అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరు గోరింటాకు పెట్టుకున్నారుట. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వెళ్లినట్లు శోభిత తెలిపింది. అటుపై జరిగిన స్టోరీ అంతా అందరికీ తెలిసిందే అంది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్ల కోసం చైతన్య తనని ఇంటికి ఆహ్వానించినట్లు తెలిపింది. ఆ తర్వాత సంవత్సరం చైతన్య తన కుటుంబాన్ని కలిసాడుట. ఒకర్ని ఒకరు అర్దం చేసుకున్న తర్వాత గోవాలో పెళ్లి ప్రతిపాదన వచ్చినట్లు తెలిపింది. శోభిత తెలుగు అమ్మాయి కావడంతో? నాగార్జున తన ఇంటి కోడలిగా ఓ తెలుగు అమ్మాయి వస్తుండటంతో? ఆయన కూడా ఎంతో సంతోషంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.