Begin typing your search above and press return to search.

చై - శోభిత.. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?

ముఖ్యంగా పెళ్లి కోసం గ్రాండ్ ప్లాన్స్ చేస్తున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 1:30 PM GMT
చై - శోభిత.. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ?
X

టాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, అందాల నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఇటీవల సింపుల్‌గా నాగార్జున నివాసంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. నాగ చైతన్య మరియు శోభిత ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వీరి పెళ్లి గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయు.

ముఖ్యంగా పెళ్లి కోసం గ్రాండ్ ప్లాన్స్ చేస్తున్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది. కానీ అలా కాకుండా అక్కినేని వారు చాలా సింపుల్ గానే ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, నాగ చైతన్య మరియు శోభిత వచ్చే ఏడాది మార్చి నెలలో రాజస్థాన్లో ట్రెడిషనల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా, ట్రెడిషనల్‌గా మాత్రమే ఉంటుందని, ఈ వేడుకకు దగ్గరి కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. ఇప్పటికే, వీరి మధ్య వయస్సు వ్యత్యాసం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య 1986లో జన్మించగా, శోభిత 1992లో పుట్టారు. ఈ లెక్కన వీరిద్దరి మధ్య కేవలం ఆరు సంవత్సరాల వయస్సు తేడా ఉంది.

ఇకపోతే చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతతో వివాహం జరిపి, తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాగ చైతన్య మరియు శోభిత మధ్య డేటింగ్ రూమర్లు గతంలోనే తెరపైకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి లండన్‌లో కనిపించారని, పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఇద్దరూ ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. చివరకు, ఆ రూమర్లకు తగ్గట్లే వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

ఈ వివాహం గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో చై - శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుక రాజస్థాన్‌లో జరిగే అవకాశం ఉందని, గ్రాండ్ గా వివాహ కార్యక్రమాలు ఉండకపోయినా, ట్రెడిషనల్ మరియు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారని భావిస్తున్నారు.

ఇక వివాహ వేడుకపై మరింత సమాచారం అధికారికంగా వెలువడటానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నాగచైతన్య తండేల్ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. మరోవైపు నాగ్ కూడా బిగ్ బాస్ తో పాటు కమిటైన తన ప్రాజెక్టులను ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల అనంతరం షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి పెళ్లి వేడుక పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.