50 కోట్లతో యువ సామ్రాట్ దుల్లగొట్టేసాడు!
ఇప్పుడా అంచనాలు సాధించే దిశగా `తండేల్` అడుగులు పడుతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ తో రన్నింగ్ లో ఉన్న సినిమా మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
By: Tupaki Desk | 9 Feb 2025 1:58 PM GMTనాగ చైతన్య కథానాయకుడిగా నటించిన `తండేల్` పాన్ ఇండియాలో ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి షోతోనే `తండేల్` సూపర్ టాక్ తెచ్చుకుంది. పబ్లిక్ మెచ్చిన చిత్రంగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలం దుకుంది. చైతన్య కెరీర్లో మరో ఫీల్ గుడ్ స్టోరీగా స్థానం దక్కించుకుంది. ఇలాంటి గొప్ప పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇంత వరకూ చైతన్య నటించిన ఏ సినిమాకు రాలేదు.
నాగ చైతన్య మాటల్లోనే ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఎంత సంతోషంగా ఉన్నాడో అర్దమైంది. ఈ సినిమాతో అక్కినేని కుటుంబం కల, అభిమానుల కోరికలు అన్నీ తిరుపోతాయని అంచనాలు రిలీజ్ కి ముందే ఏర్పడ్డాయి. ఇప్పుడా అంచనాలు సాధించే దిశగా `తండేల్` అడుగులు పడుతున్నాయి. బ్లాక్ బస్టర్ టాక్ తో రన్నింగ్ లో ఉన్న సినిమా మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. యువ సామ్రాట్ కెరీర్ లో తొలి ఫాస్టెస్ట్ 50 కోట్లు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి పోయింది.
ఇంత వరకూ చైతన్య ఇంత వేగంగా 50 కోట్ల క్లబ్ లో చేరలేదు. తొలిసారి ఆ రికార్డు చైతన్య కెరీర్ లో నమోదవ్వడంతో అభిమానుల ఆనందానికి అవదుల్లేవ్. మూడవ రోజు నుంచి సినిమాకి బుకింగ్స్ భారీ గా పెరిగాయి. దీంతో 50 కోట్లు కొల్లగొట్టడం చైతన్యకు నల్లేరు మీద నడకలా మారింది. ఇక ఈ సినిమా ముందున్న బిగ్ టార్గెట్ లాంగ్ రన్ లో సెంచరీ నమోదు చేయడమే. ఇప్పటికే 50 ప్లస్ కోట్ల వసూళ్లతో దూకుడు ప్రదర్శిస్తుంది తండేల్.
థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాకి పోటీగా మరే సినిమా కూడా లేదు. దీంతో కొన్ని రోజుల పాటు `తండేల్` దూకుడుకి ఎలాంటి ఆటంకం లేదు. థియేటర్ నుంచి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు గొప్ప లవ్ స్టోరీని ఆవిష్క రించారంటూ టీమ్ ను ప్రశంసిస్తున్నారు. ఇంకొన్ని రోజులు తండేల్ ఇదే దూకుడు ప్రదర్శిస్తే 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.