Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ అనుకునేలా..!

నటుడిగా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాలు చేస్తూ ఉంటే ఏదో ఒక టైం లో తమ బెస్ట్ ఇచ్చే అవకాశం.. నట విశ్వరూపం చూపించే టైం వస్తాయి

By:  Tupaki Desk   |   7 Feb 2025 1:33 PM GMT
ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ అనుకునేలా..!
X

నటుడిగా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాలు చేస్తూ ఉంటే ఏదో ఒక టైం లో తమ బెస్ట్ ఇచ్చే అవకాశం.. నట విశ్వరూపం చూపించే టైం వస్తాయి. అలాంటి సినిమా ప్రతి యాక్టర్ కి తమ ప్రైమ్ టైం లో పడుతుంటాయి. ఐతే ఆ ఛాన్స్ వచ్చినప్పుడు తమని తాము మలచుకున్న తీరు వారికి సక్సెస్ రూపంలో ప్రేక్షకుల నుంచి ప్రేమ లభిస్తుంది. లేటెస్ట్ గా తండేల్ సినిమాతో నాగ చైతన్యకు ఆ ఛాన్స్ వచ్చింది.

ఈ సినిమా కథ అనుకున్నప్పుడే తాను కమిటైతే కష్టపడాల్సి వస్తుందని ఫిక్స్ అయ్యాడు చైతన్య. అందుకే ఏరి కోరి ఈ కథ ఎంపిక చేసుకున్నాడు. తండేల్ రాజు పాత్ర కోసం తను పడిన కష్టమంతా కూడా తెర మీద కనిపిస్తుంది. జోష్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నాగ చైతన్య తన మార్క్ లవ్ స్టోరీస్ లో నటిస్తూ వచ్చాడు. ఈమధ్యనే తనకంటూ ఒక సర్టైన్ యూనిక్ నెస్ తెచ్చుకున్నాడు.

ఇక తండేల్ సినిమాలో అయితే నాగ చైతన్య ఇప్పటివరకు చేసిన సినిమాల కన్నీ బెస్ట్ ఇచ్చాడు. సినిమా చూసిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తే ఆమెని డామినేట్ చేస్తూ హీరో ఎలివేట్ అవ్వడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది.

ఐతే తండేల్ సినిమాలో మాత్రం సాయి పల్లవిని నాగ చైతన్య దాటేసేలా పర్ఫార్మ్ చేశాడు. సినిమా కోసం చైతన్య పడిన కష్టం అంతా కూడా తెర మీద కనిపిస్తుంది. నటుడిగా పరిపూర్ణత సాధించిన వాడిగా నాగ చైతన్య కనిపిస్తున్నాడు. మొత్తానికి తండేల్ రాజు గురించి మొదటి నుంచి చెబుతున్నట్టు గానే చైతు అదరగొట్టాడు. ఐతే తండేల్ చూసిన ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఇన్నాళ్లు ఈ పర్ఫార్మెన్స్ ఎక్కడ దాచావ్ అనుకునేలా చేశాడు. మొత్తానికి చిత్ర యూనిట్ చెప్పినట్టుగానే అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది. సినిమాలో అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నా ఓవరాల్ గా టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది. ఐతే మిగతా యాస్పెక్ట్స్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్ వైజ్ నాగ చైతన్యని చూసి అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.