'తండేల్' రికార్డ్.. ఫిబ్రవరిలో ఇదే అత్యధికం
నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న 'తండేల్' సినిమా పలు రికార్డ్‌లను దక్కించుకుంటుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 6:14 AM GMTనాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకున్న 'తండేల్' సినిమా పలు రికార్డ్‌లను దక్కించుకుంటుంది. సాధారణంగా ఫిబ్రవరి నెలను సినిమా ఇండస్ట్రీకి ఆఫ్ సీజన్ అంటారు. ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షల సీజన్ కావడంతో ఎక్కువ శాతం పెద్ద సినిమాలను విడుదల చేయడం జరగదు. మార్చి చివరి వారం నుంచి పెద్ద సినిమాల విడుదల మొదలు అవుతుంది. సమ్మర్ సీజన్ మార్చి చివరి వారం నుంచి మొదలు అవుతుంది. ఫిబ్రవరి, మార్చిలో విడుదల చేయడం అంటే పెద్ద రిస్క్ అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. కానీ తండేల్ సినిమాపై నమ్మకంతో మారిన పరిస్థితుల నేపథ్యంలో మేకర్స్ సాహసం చేశారు.
ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ సినిమాకు మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అన్ని చోట్ల కలిపి ఈ సినిమా రూ.20 కోట్లకు వసూళ్లు రాబట్టింది. నాగ చైతన్య కెరీర్‌లో మొదటి రోజు రూ 20+ కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా తండేల్ రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యి ఈ స్థాయిలో మొదటి రోజు వసూళ్లు సాధించిన సినిమాగా సైతం తండేల్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు సైతం ఓపెనింగ్ డేకి మిశ్రమ స్పందన వస్తే కనీసం రూ. పది కోట్లు రాబట్టలేక పోతున్నాయి. కానీ తండేల్ సినిమా మాత్రం ఏకంగా రూ.20 కోట్ల పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.
కంటెంట్‌పై నమ్మకంతో నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తండేల్‌ను రూపొందించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు చందు మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లు మంచి ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్‌లో వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి. మొదటి రోజు రూ.20 కోట్ల పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి రూ.60 కోట్లకు మించిన వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తక్కువ సమయంలోనే సినిమా బ్రేక్ ఈవెజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
తండేల్ సినిమాలో రియల్ స్టోరీని చూపించాం అంటూ మేకర్స్ ప్రమోషన్స్ సమయంలో చెబుతూ వచ్చారు. కానీ సినిమాలో రియల్ స్టోరీ కంటే లవ్ స్టోరీ ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ మధ్య లవ్ సీన్స్‌కి, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కి యూత్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్‌కి నచ్చిన సినిమాలకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. అందుకే ఈ సినిమా లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అల్లు అరవింద్ అన్నట్లుగానే నాగ చైతన్య కెరీర్‌లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు, డాన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. ముందు ముందు ఈ సినిమా వసూళ్లు ఇంకా ఎన్ని రికార్డ్‌లను సృష్టిస్తాయో చూడాలి.