దుల్లగొట్టేస్తున్న తండేల్.. డే1 ని మించేలా డే2
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుంది.
By: Tupaki Desk | 9 Feb 2025 6:57 AM GMTఈ సినిమా రెండో రోజున మంచి కలెక్షన్లతో దూసుకెళ్తుంది. సినిమాలోని కంటెంట్, నటీనటుల నటన, పాజిటివ్ రివ్యూలతో పాటూ మౌత్ టాక్ ను వాడుకుని తండేల్ థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ సినిమాకు రెండో రోజున భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే తండేల్ కు రెండో రోజు 260K పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసిన తండేల్, రెండో రోజు కూడా రూ.20 కోట్లకు పైగా వసూలు చేసిందంటే మాటలు కాదు. మొత్తమ్మీద రెండు రోజుల్లోనే తండేల్ రూ. 41.20 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద హిట్ గా నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ సరిహద్దులను దాటి ఓవర్సీస్ లో కూడా తండేల్ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే యూఎస్ఎలో ఈ సినిమా $550K మార్క్‌ను దాటేసింది. చూస్తుంటే ఫస్ట్ వీక్ లోపే తండేల్ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునేట్లు అనిపిస్తుంది. చూస్తుంటే ఈ లెక్ ఇప్పట్లో ఆగేలా లేదు. చైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమనిపిస్తుంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడో రోజు, రెండో రోజు కలెక్షన్లను క్రాస్ చేస్తుందని ఆదివారం బుకింగ్స్ చెప్తున్నాయి. ఇప్పటికే ఆదివారం బుకింగ్స్ నెక్ట్స్ లెవెల్ లో కనిపిస్తున్నాయి. దానికి తోడు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ చైతన్య, డైరెక్టర్ చందూ, నిర్మాత బన్నీ వాసు థియేటర్ల విజిట్ నిమిత్తం విజయవాడ, రాజమండ్రి, ఏలూరు వెళ్తున్నారు.