Begin typing your search above and press return to search.

తండేల్.. ఇప్పుడే అంత కంగారేందుకు?

తాజాగా బన్నీ పోలీస్ విచారణకి హాజరయ్యారు. అందరూ ఈ టెన్షన్ లోనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 3:00 AM GMT
తండేల్.. ఇప్పుడే అంత కంగారేందుకు?
X

నాగ చైతన్య, సాయి పల్లవి జోడీగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తండేల్’ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో ఫిబ్రవరి 7న పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా పైన నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటివరకు బిన్నమైన ప్రయోగాలు చేసిన చైతూకి ‘తండేల్’ తో బ్లాక్ బస్టర్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ మూవీ కోసం నాగ చైతన్య చాలా హార్డ్ వర్క్ చేశాడు. శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకొని మరి పాత్రకి డబ్బింగ్ చెబుతున్నారు. రియల్ లైఫ్ ఫిషర్ మెన్ క్యారెక్టర్ లో నటిస్తుండటం దానికి తగ్గట్లుగా ఉండటానికి మత్స్యకారుల లైఫ్ స్టైల్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఈ సినిమా నటుడిగా తనని మరో హైట్స్ కి తీసుకొని వెళ్తుందని అనుకుంటున్నాడు.

తండేల్ సినిమాపైన అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే అల్లు కాంపౌండ్ లో ఇప్పుడు అందరు బన్నీ ఇష్యూలో తలమునకలై ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదల అయ్యారు. తాజాగా బన్నీ పోలీస్ విచారణకి హాజరయ్యారు. అందరూ ఈ టెన్షన్ లోనే ఉన్నారు.

నిజానికి తండేల్ నుంచి సెకండ్ సింగిల్ వస్తుందని ఆ మధ్య ఎనౌన్స్ చేశారు. బన్నీ వాస్ కూడా అల్లు అర్జున్ తోపాటు ఉంటున్నాడు. బన్నీ వ్యవహారం ప్రస్తుతం నడుస్తోన్న నేపథ్యంలో సాంగ్ రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు ఫ్యామిలీ టెన్షన్ ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. అల్లు అర్జున్ ఇష్యూ కారణంగా బన్నీ వాస్ తండేల్ ప్రమోషన్స్ పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 50 రోజులకి మించి సమయం లేదు. నేషనల్ వైడ్ గా సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాలి. ఎలాంటి సమయంలో ఎక్కడ తండేల్ ప్రమోషన్స్ కి ఇబ్బంది అవుతుందో అని అక్కినేని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే అల్లు అర్జున్ చుట్టూ నడుస్తోన్న రాజకీయ వివాదం రెండు, మూడు వారాల్లో ముగిసిపోతుందని, తరువాత బన్నీ వాస్ యధావిధిగా తండేల్ ప్రమోషన్స్ పై ఫోకస్ చేస్తారని అనుకుంటున్నారు.

ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివాదం అనంతరం బన్నీ వాసు మళ్ళీ తండేల్ ప్రమోషన్ లో బిజీగా పాల్గొనే అవకాశం ఉంది. సంక్రాంతి సినిమాల అనంతరం రెగ్యులర్ గా వరుసగా కీలకమైన అప్డేట్స్ రాబోతున్నట్లు టాక్. ఇప్పటికే కంటెంట్ తో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశారు. ఇక సినిమా విడుదల సమయానికి తప్పకుండా మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు.