Begin typing your search above and press return to search.

ఇస్తాడనుకున్నాం కానీ ఇంత ఇస్తాడనుకోలేదు..!

ఐతే అలాంటి టైం లో తన బెస్ట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అదే తండేల్ సినిమా. ప్రతి హీరోకి కెరీర్ లో ఒక బెస్ట్ సినిమా ఉంటుంది.

By:  Tupaki Desk   |   4 Feb 2025 3:49 AM GMT
ఇస్తాడనుకున్నాం కానీ ఇంత ఇస్తాడనుకోలేదు..!
X

స్టార్ వారసుడిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నాగ చైతన్య తనకు లవ్ స్టోరీస్ మాత్రమే పర్ఫెక్ట్ అని బిలీవ్ చేశాడు. అందుకే కెరీర్ మొదట్లో మాస్ యాక్షన్ సినిమాలు చేసి వాటి ఫలితాలను అర్థం చేసుకుని తనకు సూటయ్యే సెన్సిబుల్ కథలనే చేస్తూ వచ్చాడు. అక్కినేని హీరోల్లో తనకంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. ఇక నటుడిగా తన పరిణితిని కూడా పెంచుకుంటూ వస్తున్నాడు. ఐతే అలాంటి టైం లో తన బెస్ట్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. అదే తండేల్ సినిమా. ప్రతి హీరోకి కెరీర్ లో ఒక బెస్ట్ సినిమా ఉంటుంది.

ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల అనుభవాన్ని తీసుకుని ఒక్క సినిమాలో బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇచ్చేస్తారు. నాగ చైతన్య కెరీర్ లో అది తండేల్ సినిమా. నాగ చైతన్య ఈ సినిమా కోసం తండేల్ రాజుగా మారిన ట్రాన్స్ ఫర్మేషన్ ఇంకా యాక్షన్ సీన్స్, డీగ్లామర్ లుక్ ఇలా అన్నిటి కోసం చాలా కష్టపడ్డాడు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కమిట్మెంట్ చూసి డైరెక్టర్ చందు మొండేటే షాక్ అయ్యాడని అర్థమవుతుంది.

తండేల్ కోసం నాగ చైతన్య కమిట్మెంట్ చూసి ఇస్తాడనుకున్నాం కానీ ఇంత ఇస్తాడనుకోలేదని చెప్పడం విశేషం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు కూడా నాగ చైతన్య కెరీర్ లో టర్నింగ్ తండేల్ అనేలా చెప్పుకొచ్చాడు. మొత్తానికి నాగ చైతన్య కరెక్ట్ టైం లో పర్ఫెక్ట్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఇప్పటివరకు అన్నీ ప్లస్ అవుతూ వచ్చాయి.

ఇక శుక్రవారం సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం నాగ చైతన్య కెరీర్ లో నిజంగానే బెస్ట్ మూవీగా తండేల్ నిలుస్తుంది. తండేల్ సినిమా లో నాగ చైతన్యతో పాటు సాయి పల్లవి నటించడం కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి తండేల్ రాజు అదే మన నాగ చైతన్య ఈ సినిమాతో ఏ రేంజ్ లో రికార్డులను సెట్ చేస్తాడు అన్నది చూడాలి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు తండేల్ సినిమాను 90 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ బ్యానర్ కి అటు హీరో నాగ చైతన్య కెరీర్ లో కూడా ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు.