Begin typing your search above and press return to search.

సైలెంట్ గా మొద‌లుపెట్టిన చైత‌న్య‌

తాజా స‌మాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే సినిమాను మొద‌లుపెట్టి నాలుగు రోజుల పాటూ షూటింగ్ కూడా చేశార‌ట‌.

By:  Tupaki Desk   |   21 March 2025 12:10 PM IST
Naga Chaitanya Shooting Start In Karthik Dandu Movie
X

అక్కినేని నాగ‌చైత‌న్య తండేల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ ల‌వ్ స్టోరీలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించ‌గా, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మించింది. గ‌త కొన్ని సినిమాలుగా స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న చైత‌న్య తండేల్ సక్సెస్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు.

ప్ర‌స్తుతం తండేల్ స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగ చైత‌న్య త‌న త‌ర్వాతి సినిమాను ఇప్ప‌టికే విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఫిక్స్ చేసుకున్న విష‌యం తెలిసిందే. చైత‌న్య కెరీర్లో 24వ సినిమాగా ఇది తెర‌కెక్కుతుంది. NC24 టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ను గ‌తేడాది చైతూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కాన్సెప్ట్ పోస్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు. పోస్ట‌ర్ ను బ‌ట్టి సినిమా మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అంద‌రికీ అర్థ‌మైంది.

తాజా స‌మాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌లే సినిమాను మొద‌లుపెట్టి నాలుగు రోజుల పాటూ షూటింగ్ కూడా చేశార‌ట‌. త్వ‌ర‌లోనే మ‌రో NC24కు సంబంధించిన మ‌రో షెడ్యూల్ మొదలుకానున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వ‌ర సినీ చిత్ర‌, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఈ ఏడాది చివ‌ర‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఈ మూవీకి వృష‌క‌ర్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్. దీంతో పాటూ మ‌రికొన్ని టైటిల్స్ ను కూడా కార్తీక్ ఈ సినిమా కోసం అనుకుంటున్నాడ‌ట‌.

విరూపాక్ష సినిమాకు మ్యూజిక్ అందించిన అజ‌నీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించ‌నున్నాడు. భారీ బ‌డ్జెట్ తో హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో రూపొంద‌నున్న ఈ సినిమాకు శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నుండ‌గా, సినిమా షూటింగ్ అట‌వీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది.