సూర్య 'రెట్రో'.. 'సితార' పెద్ద ప్లానే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హైలీ యాంటిసిపేటరీ మూవీ రెట్రోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 28 Feb 2025 2:36 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య హైలీ యాంటిసిపేటరీ మూవీ రెట్రోతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ గ్రాండ్ గా రూపొందిస్తున్నాయి.
యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ అంశాలతో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న రెట్రో సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో మూవీని సమ్మర్ కానుకగా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
అయితే రెట్రో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని ఇటీవల నిర్మాత నాగవంశీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తాము అద్భుతాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెట్రో రైట్స్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
దాంతోపాటు సూర్య వైల్డ్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విషయం వైరల్ గా మారగా.. సితార దూకుడు ఓ రేంజ్ లో ఉందని అంతా కొనియాడుతున్నారు. అదే సమయంలో సూర్యకు ప్రీ డెబ్యూ గిఫ్ట్ ఇచ్చేందుకు నాగవంశీ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. సితార బ్యానర్ పై సూర్య త్వరలోనే డైరెక్ట్ తెలుగు మూవీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకు ఇప్పుడు నాగవంశీ గిఫ్ట్ ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే నాగవంశీ.. తెలుగులో గ్రాండ్ గా చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు. కోలీవుడ్ స్టార్ హీరో లియో మూవీని భారీగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన విధంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ రీసెంట్ గా కంగువా మూవీతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన రెట్రోపై ఆశలు పెట్టుకున్నారు. మంచి హిట్ కొట్టాలని చేస్తున్నారు. అదే సమయంలో తమ బ్యానర్ పై డైరెక్ట్ ఫస్ట్ తెలుగు మూవీ చేయనున్న సూర్యకు రెట్రోతో అడ్వాన్స్ గా హిట్ ఇవ్వాలని చేస్తోంది. రెట్రో విజయం సాధిస్తే.. ఆయన తొలి తెలుగు మూవీకి మంచి ఉపయోగమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.