పవన్ వస్తే విజయ్ వెనక్కి..
అయితే హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజైతే విజయ్ మూవీ వాయిదా పడుతుందని తెలిపారు నాగవంశీ.
By: Tupaki Desk | 28 Dec 2024 9:44 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న VD 12పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
పొట్టి హెయిర్ స్టైల్ తో విజయ్ దేవరకొండ మేకోవర్ అందరికీ నచ్చేసింది! సాలిడ్ కంటెంట్ తో విజయ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో పీరియాడిక్ డ్రామాగా VD 12 మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. దీంతో సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
అయితే సినిమాను రెండు భాగాలు తీస్తున్నామని VD 12 నిర్మాత నాగవంశీ రీసెంట్ గా ప్రకటించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే సినిమా అనుకున్నామని, కానీ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నప్పుడు రెండో పార్ట్ కూడా తీయాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. రెండు కథలు సెపరేట్ అని అన్నారు.
సింపుల్ గా స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్ల రెండు పార్టులుగా తీస్తున్నారన్నామాట. అయితే మూవీని మార్చి 28వ తేదీన రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా.. పవన్ హరిహర వీరమల్లు కూడా అదే డేట్ ను రిలీజ్ కానుంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా రిలీజ్ చేయాలని వీరమల్లు మేకర్స్.. శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు.
ఓవైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా జనవరి 1న తొలి సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. దీంతో కచ్చితంగా అనుకున్న తేదీకి వీరమల్లు రానున్నట్లు తెలుస్తోంది. అయితే హరిహర వీరమల్లు మార్చి 28న రిలీజైతే విజయ్ మూవీ వాయిదా పడుతుందని తెలిపారు నాగవంశీ.
ఏప్రిల్ లేదా మేలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఆ రెండు నెలల్లో కూడా చాలా పోటీ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ ను టాలీవుడ్ మేకర్స్.. సంక్రాంతి తర్వాత బెస్ట్ సీజన్ గా ట్రీట్ చేస్తుంటారు. కాబట్టి VD 12ను ఎప్పుడు రిలీజ్ చేస్తారోనని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.