Begin typing your search above and press return to search.

'లక్కీ భాస్కర్'.. పాన్ ఇండియా రిలీజ్‌ కోసం న్యూ స్ట్రాటజీ!

అన్ని ప్రధాన మార్కెట్లలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  Tupaki Desk   |   12 Oct 2024 7:30 PM GMT
లక్కీ భాస్కర్.. పాన్ ఇండియా రిలీజ్‌ కోసం న్యూ స్ట్రాటజీ!
X

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్‌కు దేశవ్యాప్తంగా ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పాన్-ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని ప్రధాన మార్కెట్లలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల విషయానికి వస్తే, అది మిగతా భాషలతో సమకాలంలో కాకుండా, కొద్దిగా ఆలస్యంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నిర్మాత ఎస్ నాగ వంశీ మాట్లాడుతూ, "తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని, కానీ హిందీ వెర్షన్ నవంబర్ మొదటి వారంలో విడుదల అవుతుందని" వెల్లడించారు.

ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం బాలీవుడ్ లో నవంబర్ 1న విడుదలవుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగం అగేన్’ సినిమా అని ఆయన పేర్కొన్నారు. "సింగం అగేన్" వంటి పెద్ద చిత్రంతో ఒకే రోజు విడుదలైతే "లక్కీ భాస్కర్" హిందీ వెర్షన్‌కి తగిన స్థాయి థియేటర్లు దొరకకపోవచ్చు. కాబట్టి హిందీ మార్కెట్‌ లో మరింత స్పేస్ దొరికేలా, నవంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించాం" అని నాగ వంశీ తెలిపారు.

ఈ స్ట్రాటజీ వల్ల హిందీ వెర్షన్‌కి మంచి విడుదల అవుతుందని, ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతుందని నిర్మాతలు విశ్వసిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర ఈ సినిమాలో కీలకంగా ఉండనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అనేక మంది సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతోంది. వెంకీ తన ప్రీవియస్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడంలో విజయవంతం అయ్యారు.

ఈసారి, ఆయన రూపొందించిన "లక్కీ భాస్కర్" కూడా పెద్ద సక్సెస్ సాధించే అవకాశం ఉందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఇక ఈ సినిమాకి ప్రముఖ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అంధించగా ఆ పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత అందం తెచ్చేలా ఉంటుందని టీమ్ ఆశిస్తోంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది.